Sidharth Malhotra – Kiara Advani : ఒక్కటైన ప్రేమజంట.. ఏడడుగులు వేసేసిన కియారా, సిద్దార్ద్!
బాలీవుడ్ లోని సెలెబ్రెటీస్ అంతా ఒకరి తరువాత ఒకరు పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న కియారా అద్వానీ, సిద్దార్ద్ మల్హోత్రా ఏడడుగులతో ఒకటయ్యారు.

Sidharth Malhotra – Kiara Advani : బాలీవుడ్ లోని సెలెబ్రెటీస్ అంతా ఒకరి తరువాత ఒకరు పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. కత్రినాతో మొదలైన ఈ పెళ్లిసందడి.. అలియా, అతియా శెట్టి, ఇప్పుడు కియారా అద్వానీ వరసగా పెళ్లి చేసుకొని ఒక ఇంటి వారు అవుతున్నారు. సిద్దార్ద్ మల్హోత్రా హీరోగా తెరకెక్కిన ‘షేర్షా’ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటించింది. ఆ మూవీ షూటింగ్ సమయంలో వారిద్దరూ ప్రేమలో పడ్డారని, అప్పటి నుంచి సీక్రెట్ గా రేలషన్‌షిప్ మెయిన్‌టైన్ చేస్తున్నారని బాలీవుడ్ మీడియాలు కథనాలు రాస్తూ వచ్చాయి.
Kiara Advani: కియారా పెళ్లికి ఎన్నికోట్ల ఖర్చో తెలుసా..?
ఇక ఇటీవల ఈ వార్తలు నిజం చేస్తూ ఎటువంటి హడావుడి లేకుండా పెళ్ళికి సిద్ధమయ్యారు ఈ ప్రేమ జంట. రాజస్థాన్ జైసల్మేర్‌లోని సూర్యగఢ్ ప్యాలెస్‌లో కియారా, సిద్దార్ద్ పెళ్లి చేసుకోబోతున్నట్లు వెడ్డింగ్ ఫోటోగ్రఫీ సంస్థ వైరల్ భయానీ కన్‌ఫార్మ్ చేసింది. ఫిబ్రవరి 4 నుంచే మొదలైన కియారా పెళ్లి వేడుకలకు ఇరు కుటుంబ సభ్యులతో పాటు ఇషా అంబానీ, కరణ్ జోహార్, షాహిద్ కపూర్, మనీష్ మల్హోత్రా పలువురు బాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు. పెళ్ళికి సంబంధించిన ఫోటోలను, వీడియోలను ఇప్పటి వరకు రిలీజ్ చేయలేదు ఈ న్యూ కపుల్.
అయితే ఈ పెళ్ళిలో పని చేస్తున్న వారిని కొందరు నెటిజెన్లు పెళ్లి గురించి ప్రశ్నించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కియారా, సిద్దార్ద్ ఏడడుగులు వేసేశారని, వారిద్దరూ ఏ డ్రెస్ లో ఉన్నారనే విషయాలను ఆ వీడియోలో చెప్పుకొచ్చారు వర్కర్స్. అలాగే ఈ పెళ్ళికి హాజరయ్యిన కొంతమంది గెస్ట్ లు తమ సోషల్ మీడియాలో పెళ్లి మండపాన్ని, ఫుడ్ ని షేర్ చేస్తూ కంగ్రాట్స్ తెలియజేశారు. మొదటి నుంచి అంతా సీక్రెట్ గా మెయిన్‌టైన్ చేస్తూ వస్తున్న కియారా, సిద్దార్ద్ పెళ్లి ఫోటోలను కూడా షేర్ చేయకుండా సీక్రెట్ గా ఉంచడంతో అభిమానులు బాధ పడుతున్నారు.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram