SIIMA Awards 2019 : సైమా (తెలుగు) విజేతలు వీళ్లే..

ఏటా ప్రతిష్టాత్మకంగా జరిగే సైమా అవార్డ్స్ కార్యక్రమం సెప్టెంబర్ 18, 19 తేదీల్లో హైదరబాద్‌లో జరుగుతుంది..

SIIMA Awards 2019 : సైమా (తెలుగు) విజేతలు వీళ్లే..

Siima 2019

SIIMA Awards 2019: ‘సైమా’.. (సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్).. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం ఇండస్ట్రీలను ఒకే వేదిక మీదకు తీసుకొచ్చే ప్రెస్టీజియస్ అవార్డ్స్ ఇవి. ఏటా దుబాయ్‌లో అంగరంగవైభవంగా ఈ అవార్డ్స్ ఈవెంట్ చేస్తుంటారు. నాలుగు భాషలకు చెందిన స్టార్స్ అంతా ఒకే వేదికపై కనిపించి ప్రేక్షకాభిమానులను ఎంటర్‌టైన్ చేస్తుంటారు.

Siima

అయితే కోవిడ్ కారణంగా గత మూడేళ్లుగా ‘సైమా’ అవార్డ్స్ వేడుక నిర్వహించడం లేదు. శనివారం హైదరాబాద్‌లో 2019 సంవత్సరానికి గానూ అవార్డ్స్ అందజేశారు. సెప్టెంబర్ 18, 19 తేదీల్లో ఈ కార్యక్రమం జరుగుతుంది. సెప్టెంబ‌ర్ 18న తెలుగు ఇండ‌స్ట్రీకి సంబంధించిన సైమా అవార్డుల వేడుక జ‌ర‌గింది. 2019 సంవత్సరానికి సంబంధించి విజేత‌ల‌కు అవార్డులు అందించారు. ‘మహర్షి’ సినిమాకు గాను సూపర్ స్టార్ మహేష్ బాబుకి ఉత్తమ నటుడిగా ఎంపీ సంతోష్‌కుమార్‌ అవార్డు ఇచ్చారు.

Mahesh Babu

సైమా విజేతల వివరాలు..
ఉత్తమ చిత్రం: జెర్సీ (సితార ఎంటర్‌‌టైన్‌మెంట్స్)
ఉత్తమ వినోదాత్మక చిత్రం: ఎఫ్2 (శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్)
ఉత్తమ దర్శకుడు: వంశీ పైడిపల్లి (మహర్షి)
ఉత్తమ నటుడు: మహేష్ బాబు (మహర్షి)
ఉత్తమ నటుడు (క్రిటిక్స్): నాని (జెర్సీ)

Bigg Boss 5 Telugu : ఉమా దేవి ఎలిమినేషన్‌కి కారణం ఏంటంటే..

ఉత్తమ నటి: సమంత (ఓ బేబీ)
ఉత్తమ నటి (క్రిటిక్స్): రష్మిక మందన్న (డియర్ కామ్రేడ్)
ఉత్తమ సహాయ నటుడు: అల్లరి నరేష్ (మహర్షి)
ఉత్తమ సహాయ నటి: లక్ష్మీ (ఓ బేబీ)
ఉత్తమ విలన్: కార్తికేయ గుమ్మకొండ (నాని’స్ గ్యాంగ్ లీడర్)

Siima 2019

ఉత్తమ తొలి పరిచయ హీరో: శ్రీ సింహా (మత్తు వదలరా)
ఉత్తమ తొలి పరిచయ హీరోయిన్: శివాత్మిక రాజశేఖర్ (దొరసాని)
ఉత్తమ కమెడియన్: అజయ్ ఘోష్ (రాజుగారి గది 3)
ఉత్తమ సంగీత దర్శకుడు: దేవిశ్రీ ప్రసాద్ (మహర్షి)
ఉత్తమ గేయ రచయిత: శ్రీమణి (ఇదే కదా.. మహర్షి)

Nani

ఉత్తమ గాయకుడు: అనురాగ్ కులకర్ణి (ఇస్మార్ట్ శంకర్-టైటిల్ సాంగ్)
ఉత్తమ గాయని: చిన్మయి (మజిలీ-ప్రియతమా)
ఉత్తమ తొలి పరిచయ దర్శకుడు: స్వరూప్ ఆర్ఎస్‌జె (ఏజంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ)
ఉత్త తొలి పరిచయ నిర్మాత: స్టూడియో 99 (మల్లేశం)
ఉత్తమ సినిమాటోగ్రాఫర్: సానూ వర్గీస్‌ (జెర్సీ)..

SIIMA : 10 కేటగిరీల్లో మహేష్ మూవీ.. తర్వాతి ప్లేస్‌లో చైతు – నాని..