Brahmastra: బ్రహ్మాస్త్రలో కార్తికేయ-2 పోలికలు.. ఇవన్నీ సేమ్ టు సేమ్!

బాలీవుడ్ బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా తెరకెక్కిన ‘బ్రహ్మాస్త్ర’ సెప్టెంబర్ 9న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కించగా, రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ జంటగా నటించారు. కాగా, తాజాగా రిలీజ్ అయిన బ్రహ్మాస్త్ర చిత్రం కార్తికేయ-2 సినిమాతో కంపేర్ చేస్తున్నారు ఆడియెన్స్.

Brahmastra: బ్రహ్మాస్త్రలో కార్తికేయ-2 పోలికలు.. ఇవన్నీ సేమ్ టు సేమ్!

Brahmastra: బాలీవుడ్ బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా తెరకెక్కిన ‘బ్రహ్మాస్త్ర’ సెప్టెంబర్ 9న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కించగా, రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ జంటగా నటించారు. ఈ సినిమాకు రిలీజ్ అయిన అన్ని చోట్లా పాజిటిక్ రెస్పాన్స్ రావడంతో ఈ సినిమా తొలిరోజు భారీ కలెక్షన్లు రాబట్టినట్లు బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.

Brahmastra: బ్రహ్మాస్త్ర ఫస్ట్‌డే కలెక్షన్స్ ఎంతో తెలుసా?

అయితే ఇటీవల రిలీజ్ అయిన కార్తికేయ-2 సినిమా పాన్ ఇండియా వైడ్‌గా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. కాగా, తాజాగా రిలీజ్ అయిన బ్రహ్మాస్త్ర చిత్రం కార్తికేయ-2 సినిమాతో కంపేర్ చేస్తున్నారు ఆడియెన్స్. ఈ రెండు సినిమాల్లో పలు అంశాలు ఒకే విధంగా ఉండటంతో అవి ఏమిటా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. అయితే ఈ రెండు సినిమాల్లో మూడు అంశాలు ఒకే ఫార్ములాతో తెరకెక్కడం విశేషం.

ముందుగా, కార్తికేయ-2 మూవీలో శ్రీకృష్ణ తత్వం, ప్రస్తుత కాలంపై దాని ప్రభావం ఏమిటనే అంశాన్ని టచ్ చేశారు. ఇటు బ్రహ్మాస్త్రలో కూడా పలు రాకల అస్త్రాలకు సంబంధించిన శక్తి ఏమిటనే అంశాన్ని టచ్ చేశారు. ఇక రెండోది, కార్తికేయ-2లో శ్రీకృష్ణుడి కాలి కడెం కోసం నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ చేసే అడ్వెంచర్‌ను మనకు చూపించారు. బ్రహ్మాస్త్రలో విభిన్న అస్త్రాలకు సంబంధించిన కనెక్షన్ ఏమిటనేది తెలుసుకునేందుకు రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ సాహసయాత్ర చేస్తారు. మూడోది, కార్తికేయ-2 సినిమాలో శ్రీకృష్ణ తత్వం గురించి బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ అద్భుతంగా వివరిస్తాడు. బ్రహ్మాస్త్రంలో వస్త్రాల ప్రాముఖ్యతను బిగ్ బి అమితాబ్ బచ్చన్ వివరిస్తాడు.

Brahmastra Review : బ్రహ్మాస్త్ర రివ్యూ.. కేవలం విజువల్ ఫీస్ట్ మాత్రమేనా??

ఈ మూడు అంశాలు కూడా హిందూ ధర్మానికి సంబంధించినవి కావడం విశేషం. ఇలా మూడు అంశాల్లో కార్తికేయ-2, బ్రహ్మాస్త్రం చిత్రాలు పోలి ఉండటంతో ప్రేక్షకులు ఈ రెండు సినిమాలను ఆదరించడంలో అవి కీలక పాత్రలు పోషించాయని పలువురు ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు.