Vani Jairam : వాణీ జయరాం అవార్డులు, రివార్డులు..

ప్రముఖ సినీ సింగర్ వాణి జయరాం ఫిబ్రవరి 4న కన్నుమూశారు. తెలుగు, తమిళంతో పాటు దాదాపు 18 భాషల్లో 10 వేల పైగా పాటలను పాడిన వాణి.. ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్నారు.

Vani Jairam : వాణీ జయరాం అవార్డులు, రివార్డులు..

Vani Jairam

Vani Jairam : సినీ పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. నటీనటులు నుంచి సాంకేతిక నిపుణులు వరకు ఒకరి తరువాత ఒకరు స్వర్గస్తులు అవుతూ వస్తున్నారు. వారి మరణ వార్తలతో ఫిలిం ఇండస్ట్రీ శోక సంద్రంలో మునిగి తేలుతుంది. ఇటీవలే కళాతపస్వి కె.విశ్వనాథ్ మరణం అందర్నీ కలిచి వేసింది. ఆయన ఇక లేరు అన్న ఆలోచన మర్చిపోక ముందే రోజు వ్యవధిలోనే మరో కళామతల్లి ముద్దుబిడ్డని కోల్పోవడం అందర్నీ దిగ్బ్రాంతికి గురి చేసింది. ప్రముఖ సినీ గాయని ‘వాణి జయరాం’ నిన్న (ఫిబ్రవరి 4) చెన్నైలోని ఆమె ఇంటిలో తుది శ్వాస విడిచారు. అయితే ఆమె మరణం పై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆమె తల నుదురు పై గాయాలు ఉండడం గుర్తించి పోస్టుమార్టం కోసం పంపించారు పోలీసులు.

Vani Jairam : వాణీ జయరాం మరణంపై అనుమానాలు.. పోస్టుమార్టంలో గాయాలు గుర్తింపు!

కాగా వాణి జయరాం తమిళనాడు కి చెందిన వ్యక్తి. సంగీత కుటుంబంలో పుట్టిన వాణి.. చిన్నప్పుడు నుంచే సంగీత సాధన చేస్తూ వచ్చారు. ఆమె సినిమాకి పరిచయమైంది హిందీ సినిమాలతో, 1971లో రిలీజ్ అయిన జయా బచ్చన్ ‘గుడ్డి’ సినిమాతో ఆమె సినీరంగ ప్రవేశం చేశారు. ఆ చిత్రంలో వాణి మూడు పాటలు పడగా, మూడు సూపర్ హిట్ గా నిలిచాయి. మొదటి సినిమాతోనే.. బాలీవుడ్ సంగీత ప్రపంచాన్ని ఏలుతున్న లతా మంగేష్కర్ కి భయం పుట్టించారు వాణి. లతా అభిమాని అయిన వాణి ఆమెకే పోటీ అయ్యి నిలిచింది. అది తట్టుకోలేక లతా మంగేష్కర్, వాణిని బాలీవుడ్ లో బాయ్‌కాట్ చేసేలా చేసింది అంటారు కొంతమంది.

ఇక బాలీవుడ్ నుంచి సౌత్ కి తిరిగి వచ్చేసిన వాణి.. మళ్ళీ తిరిగి వెనక్కి చూసుకోలేదు. అప్పటికే ఎన్నో అవార్డులు అందుకున్నా, సౌత్ లో పాడిన పాటలకు ఆమె 3 నేషనల్ అవార్డ్స్ ని కైవసం చేసుకున్నారు. అపూర్వ రాగంగాళ్ సినిమాకు గాను 1975లో మొదటి నేషనల్ అవార్డుని సొంతం చేసుకున్నారు. ఆ తరువాత తెలుగు ఎవర్ గ్రీన్ మ్యూజికల్ హిట్ శంకరాభరణం సినిమాకి 1980లో రెండో నేషనల్ అవార్డుని అందుకున్నారు. మూడో అవార్డు కూడా కె.విశ్వనాథ్ దర్శకత్వంలోనే తెరకెక్కిన మరో మ్యూజికల్ తెలుగు మూవీ స్వాతి కిరణం చిత్రానికి 1991లో అందుకున్నారు.

అలాగే 3 ఫిలిం ఫేర్ అవార్డులు, 4 స్టేట్ అవార్డులు, ఘంటసాల నేషనల్ అవార్డు, నార్త్ అమెరికన్ ఫిలిం అవార్డు, ఎం ఎస్ సుబ్బలక్ష్మి అవార్డు, సౌత్ ఇండియన్ మీరా.. ఇలా మరో 13 అవార్డులు అందుకున్నారు. అంతేకాదు రీసెంట్ గా ఆమెకు భారత్ ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారాన్ని కూడా ప్రకటించింది. కానీ అది అందుకునే లోపే ఆమె తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. తెలుగు, తమిళంతో పాటు దాదాపు 18 భాషల్లో పాటలను పాడిన వాణి.. సుమారు వేయి సినిమాల్లో 10 వేల పైగా పాటలను ఆలపించారు.