10TV Exclusive: శివాజీ రాజా ఆరోగ్య పరిస్థితి వెల్లడించిన తనయుడు విజయ్ రాజా

శివాజీ రాజా ఆరోగ్య పరిస్థితి తెలియచేసిన విజయ్ రాజా..

  • Published By: sekhar ,Published On : May 5, 2020 / 05:58 PM IST
10TV Exclusive: శివాజీ రాజా ఆరోగ్య పరిస్థితి వెల్లడించిన తనయుడు విజయ్ రాజా

శివాజీ రాజా ఆరోగ్య పరిస్థితి తెలియచేసిన విజయ్ రాజా..

టాలీవుడ్ సీనియర్ నటుడు శివాజీ రాజాకు హార్ట్ ఎటాక్ వచ్చిందనే వార్త సినీ వర్గాల వారిని షాక్‌కి గురిచేసింది. సడెన్‌గా స్ట్రోక్ రావడంతో కుటుంబ సభ్యులు ఆయనను బంజారాహిల్స్‌లోని స్టార్ ఆస్పత్రిలో చేర్చారు. ప్రస్తుతం వైద్యులు చికిత్స అందిస్తున్నారు. తాజాగా శివాజీ రాజా తనయుడు విజయ్ రాజా తండ్రి ఆరోగ్య పరిస్థితి గురించి 10TVకి తెలియచేశారు.

‘డాడీ ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డాక్టర్స్ తెలిపారు. అలాగే ఆయనకు స్టంట్ వేయాలని చెప్పారు. ప్రస్తుతం అబ్జర్వేషన్‌లో ఉంచారు. ఎల్లుండి స్టంట్ వేస్తామని చెప్పారని’ అన్నారు. శివాజీరాజాకు గుండెపోటు వచ్చిందన్న విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు, మా అసోసియేషన్ సభ్యులు ఆయన కుటుంబ సభ్యులను ఫోన్లలో పరామర్శించి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

Read Also : శివాజీరాజాకు హార్ట్ స్ట్రోక్.. స్టార్ ‌హాస్పిటల్‌కు తరలింపు..