Movies : పెద్ద సినిమాలయిపోయాయి.. ఇక చిన్న, మీడియం సినిమాల వంతు.. | small and medium movie upcoming 2 months ready to release

Movies : పెద్ద సినిమాలయిపోయాయి.. ఇక చిన్న, మీడియం సినిమాల వంతు..

కొవిడ్ తో ఆగిన, లేట్ అయిన సినిమాలన్నీ వరుసపెట్టి థియేటర్స్ ను టార్గెట్ చేశాయి ఇన్ని రోజులు. వరుసగా పుష్ప, అఖండ, ఆచార్య, RRR,KGF, F3, సర్కారు వారి పాట.. ఇలా పెద్ద సినిమాలన్నీ......

Movies : పెద్ద సినిమాలయిపోయాయి.. ఇక చిన్న, మీడియం సినిమాల వంతు..

Movies :  కొవిడ్ తో ఆగిన, లేట్ అయిన సినిమాలన్నీ వరుసపెట్టి థియేటర్స్ ను టార్గెట్ చేశాయి ఇన్ని రోజులు. వరుసగా పుష్ప, అఖండ, ఆచార్య, RRR,KGF, F3, సర్కారు వారి పాట.. ఇలా పెద్ద సినిమాలన్నీ రిలీజ్ అయ్యాయి. కరోనా థర్డ్ వేవ్ తర్వాత మోస్ట్ అవైటైడ్ సినిమాలన్నీ లెక్కలేసుకుని మరీ ప్రేక్షకుల ముందుకొచ్చాయి. ఇప్పటిదాకా పెద్ద సినిమాలు సందడి చేస్తే ఇప్పట్నించీ ఓ రెండు, మూడు నెలలు అన్నీ చిన్న, మీడియం సినిమాలు సందడి చేయనున్నాయి.

ఇకపై వచ్చే రెండు, మూడు నెలలు యంగ్ హీరోలు, మీడియం బడ్జెట్ సినిమాలదే హవా. ఈవారం రానా, సత్యదేవ్ లు వాళ్ల అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. 90ల నాటి రియల్ ఇన్సిడెంట్స్ తో పీరియాడికల్ మూవీగా విరాటపర్వం రెడీ కాగా, మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాగా గాడ్సే తయారైంది. ఈ రెండు సినిమాలు జూన్ 17న రానున్నాయి.

జూన్ 24న ఏకంగా ఒకేరోజు 6 సినిమాలు విడుదలకానున్నాయి. అవికా గోర్, శ్రీకాంత్ లీడ్ రోల్స్ చేసిన టెన్త్ క్లాస్ డైరీస్ తో పాటూ కిరణ్ అబ్బవరం, చాందిని నటించిన సమ్మతమే కూడా జూన్ 24నే థియేటర్స్ ని టార్గెట్ చేసింది. అటు స్టార్స్ తో ఎన్నో క్రేజీ సినిమాలు నిర్మించిన సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ అధినేత MS రాజు తన కొడుకు సుమంత్ అశ్విన్ ని హీరోగా పెట్టి డైరెక్ట్ చేసిన 7డేస్ 6నైట్స్ మూవీని 24నే చూపించబోతున్నాడు. 10త్ క్లాస్ డైరీస్, 7డేస్ 6నైట్స్, సమ్మతమే సినిమాలతో పాటూ జూన్ 24న మరో మూడు సినిమాలు దిగబోతున్నాయి. లక్ష్య్ హీరోగా ఇషాన్ సూర్య డైరెక్ట్ చేసిన గ్యాంగ్ స్టర్ గంగరాజు, సాయిధన్సిక, తేజ్ కురపాటి జంటగా తెరకెక్కిన రొమాంటిక్ ఎంటర్ టైనర్ షికారు, ఆకాశ్ పూరీ చోర్ బజార్ కూడా 24వ తేదీన రిలీజ్ కానున్నాయి.

జూలై 1న గోపీచంద్, మారుతి కలిసి పక్కా కమర్షియల్ చూపించబోతున్నారు. అదే రోజూ తమిళ్ డబ్బింగ్ ఫిల్మ్ ఏనుగు రిలీజ్ అవ్వనుంది. అరుణ్ విజయ్ హీరోగా, హరి దర్శకత్వంలో ఏనుగు రూపొందింది.

జూలై 8న నాగచైతన్య, విక్రమ్ కే కుమార్ కాంబో మూవీ థాంక్యూను రిలీజ్ చేసేలా సన్నాహాలు చేస్తున్నారు. ఎనర్జిటిక్ హీరో రామ్ ది వారియర్ గా జూలై 14న సందడి చేయబోతున్నాడు. ది వారియర్ కి ఒక రోజు తేడాతో జూలై 15న లావణ్య త్రిపాఠీ లీడ్ రోల్ చేసిన హ్యాపీ బర్త్ డేతో పాటూ సత్యదేవ్, తమన్నాల గుర్తుందా శీతాకాలం రిలీజ్ కాబోతుంది.

Rajinikanth : ఎట్టకేలకు తలైవా 169.. బీస్ట్ దర్శకుడితో జైలర్ గా రజినీ..

జూలై 22న నిఖిల్ కార్తీకేయ 2 డేట్ ఫిక్స్ చేసుకుంది. కార్తీకేయ సీక్వెల్ గా రానున్న ఈ మూవీలో కృష్ణుడు ఏలినట్టు చెప్పే ద్వారకాను బ్యాక్ డ్రాప్ గా తీసుకున్నారు. జూలై 28న కిచ్చా సుదీప్ విక్రాంత్ రోణాను పాన్ ఇండియా వైడ్ రిలీజ్ చేస్తున్నాడు. జూలై 29న హిట్ 2 రిలీజ్ కానుంది. హిట్1 లో విశ్వక్ సేన్ ను హీరోగా ప్రెజెంట్ చేసిన నాని హిట్ 2లో అడవి శేష్ తో సెకండ్ కేస్ ను డీల్ చేయిస్తున్నాడు. ఈ మూవీ డైరెక్టర్ కూడా శైలేష్ కొలనునే.

ఆగస్ట్ 5న రెండు టైమ్ ట్రావెల్ మూవీస్ రిలీజ్ కానున్నాయి. కల్యాణ్ రామ్ డ్యూయల్ రోల్ చేసిన బింబిసార అందులో ఒకటి. కేథరిన్, సంయుక్త మీనన్ హీరోయిన్స్ కాగా విశిష్ట్ బింబిసారను డైరెక్ట్ చేసాడు. కాగా ఆగస్ట్ 5న బింబిసారతో పాటూ పాన్ ఇండియా ఫిల్మ్ సీతారామం రిలీజ్ కానుంది. అశ్వినీదత్ నిర్మాణంలో హనురాఘవపూడి ఈ సినిమాను ఆర్మీ బ్యాక్ డ్రాప్ లో పీరియాడికల్ మూవీగా డైరెక్ట్ చేస్తున్నాడు. దుల్కర్ సల్మాన్ లెఫ్ట్ నెంట్ రామ్ గా కనిపించబోతుండగా మృణాల్ థాకూర్ హీరోయిన్ గా రష్మిక మందన్నా కశ్మీర్ యువతిగా నటించింది.

Heroines : వీళ్ళు పెళ్లిళ్లు చేసుకోరా?? 30 దాటి ఏళ్ళు గడుస్తున్నా పెళ్లి మాట ఎత్తని హీరోయిన్స్..

ఆగస్ట్ 12న నితిన్ మాచర్ల నియోజక వర్గం సినిమా విడుదల కానుంది. కృతిశెట్టి హీరోయిన్ గా నటిస్తోంది ఇందులో. అదే రోజు సమంతా వుమెన్ సెంట్రిక్ ఫిల్మ్ యశోద రానుంది. ఇక ఆగస్ట్ 13న టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు బెల్లంకొండ గణేశ్. వర్షా బొల్లమ్మ హీరోయిన్ గా బెల్లంకొండ గణేశ్ హీరోగా నటించిన స్వాతిముత్యం ఆగస్ట్ 13న థియేటర్స్ కి రానుంది.

ఇలా వరుసగా చిన్న సినిమాల రిలీజ్ తర్వాత ఆగస్ట్ 25న మోస్ట్ అవైటైడ్ మూవీ లైగర్ బరిలోకి దిగనుంది. పాన్ ఇండియా వైడ్ రౌడీఫ్యాన్స్ ఎదురుచూస్తోన్న సినిమా ఇది. పూరీ డైరెక్షన్లో తెరకెక్కిన లైగర్ ఇప్పటికే ప్రీబిజినెస్ డీల్ తో రచ్చ చేసింది. ఇలా దాదాపు రెండు నెలలు మొత్తం చిన్న, మీడియం సినిమాలు ఉన్నాయి.

×