Samantha : రెమ్యునరేషన్ పెంచేసిన సమంత.. వర్కౌట్ అవుతుందా??

విడాకుల తర్వాత సినిమాలలో స్పీడ్ తో పాటు రెమ్యూనరేషన్ కూడా పెంచినట్టు సమాచారం. అంతకు ముందు సమంత సినిమా స్థాయి, పాత్ర పరిధిని బట్టి ఒక కోటి రూపాయల నుంచి కోటిన్నర వరకు తీసుకునేది

Samantha : రెమ్యునరేషన్ పెంచేసిన సమంత.. వర్కౌట్ అవుతుందా??

Sam

Samantha : చైతన్యతో విడాకుల తర్వాత సమంత రోజూ వార్తల్లో నిలుస్తుంది. చై విడాకుల తర్వాత నుంచి సోషల్ మీడియాలో ఒక్క పోస్ట్ కూడా పెట్టలేదు. ఎక్కువగా కనపడకుండా తన పని తానూ చూసుకుంటున్నాడు. సమంత మాత్రం రోజుకొక పోస్ట్ తో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. సమంత పెట్టే పోస్టులు చర్చలకు దారి తీస్తున్నాయి. ఇక సమంత బిజీగా ఉండటానికి ట్రై చేస్తుంది. ఒక పక్క యాత్రలు చేస్తూ మరో పక్క సినిమాలని కూడా అనౌన్స్ చేస్తుంది.

Nithin : భార్యని గన్ తో బెదిరించిన నితిన్.. నేను సేఫ్ గా లేను అని పోస్ట్

సమంత సౌత్ లో స్టార్ హీరోయిన్. ‘ఫ్యామిలీ మాన్’ సిరీస్ తో నార్త్ లో కూడా బాగా పేరు తెచ్చుకుంది. ‘ఓ బేబీ’ సినిమా తప్ప వేరే లేడీ ఓరియెంటెడ్ సినిమాలు ఏమి చేయలేదు సమంత. మంచి యాక్టర్ అయినా సరే హీరోల పక్కన కమర్షియల్ హీరోయిన్ గానే మిగిలిపోయింది ఇన్ని రోజులు. అనుష్క, నయనతార లాగా తాను కూడా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు తీసి సపరేట్ ఫ్యాన్ బేస్ తెచ్చుకోవాలని చూస్తుంది. విడాకులు అయిన తర్వాత వరసగా సినిమాలు చేయాలని, ఆ సినిమాలు కూడా డిఫరెంట్ గా ఉండాలని ప్లాన్ చేస్తుంది సమంత.

Bigg Boss 5 : మరోసారి గొడవపడ్డ ష‌ణ్ను, సన్నీ

ఇటీవల దసరా రోజు తన రెండు సినిమాలని అనౌన్స్ చేసింది. ఒకటి డ్రీం వారియర్స్ పిక్చర్స్ నిర్మాణంలో, మరొకటి శ్రీదేవి మూవీస్ నిర్మాణంలో తెరకెక్కనున్నాయి. అయితే ఈ రెండు కూడా లేడీ ఓరియెంటెడ్ సినిమాలనే సమాచారం. తెలుగులో ‘శాకుంతలం’ సినిమా ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుంది. తమిళ్ లో విఘ్నేశ్ శివ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో ‘కాతువాకుల రెండు కాధ‌ల్’ చిత్రంలో న‌టిస్తోంది.

Bigg Boss 5 : బిగ్ బాస్ 5లో థ్రిల్ లేదు.. ఈ సారి అమ్మాయిలు గెలుస్తారనుకున్నా.. కాని : కౌశల్

విడాకుల తర్వాత సినిమాలలో స్పీడ్ తో పాటు రెమ్యూనరేషన్ కూడా పెంచినట్టు సమాచారం. అంతకు ముందు సమంత సినిమా స్థాయి, పాత్ర పరిధిని బట్టి ఒక కోటి రూపాయల నుంచి కోటిన్నర వరకు తీసుకునేది. తాజా అప్‌డేట్ ప్ర‌కారం ఇప్పుడు సమంత చేయబోయే సినిమాలకు 2 నుంచి 3 కోట్లు తీసుకుంటుంద‌ని తెలుస్తోంది. సమంతకి ఎలాగో సౌత్ లో మార్కెట్ ఉంది. ‘ఫ్యామిలీ మ్యాన్’ తర్వాత నార్త్ లో కూడా మార్కెట్ ఏర్పడటంతో సమంత సినిమాలని పాన్ ఇండియా వైడ్ లో రిలీజ్ చేయొచ్చు అనే ఆలోచనతో సమంత రెమ్యూనరేషన్ కి నిర్మాతలు కూడా ఒప్పుకున్నట్టు సమాచారం. మరి సినిమా బడ్జెట్, కలెక్షన్ లెక్కలు చూసుకుంటే సమంతతో ఇది వర్కౌట్ అవుతుందో లేదో చూడాలి మరి.