Sonu Sood : అతనికి మంచి పెళ్లి సంబంధం చెప్పండి .. మొక్కజొన్న వ్యాపారి కోసం సోనూ సూద్ రిక్వెస్ట్

నటుడిగా ఎంతో పేరున్న సోనూ సూద్ అందరితో ఎటువంటి భేషజం లేకుండా పలకరిస్తారు. తనకి చేతనైన సాయం చేస్తుంటారు. రీసెంట్‌గా ఓ మొక్కజొన్న వ్యాపారితో ఆయన జరిపిన సంభాషణ వైరల్ అవుతోంది.

Sonu Sood : అతనికి మంచి పెళ్లి సంబంధం చెప్పండి .. మొక్కజొన్న వ్యాపారి కోసం సోనూ సూద్ రిక్వెస్ట్

Sonu Sood

Updated On : June 20, 2023 / 3:49 PM IST

Sonu Sood : నటుడు సోనూ సూద్ సోషల్ సర్వీస్ గురించి అందరికీ తెలిసిందే. కరోనా సమయంలో ఎంతో సాయం అందించి ఎంతోమంది అభిమానుల్ని సంపాదించుకున్నారు. ఒక నటుడిగా కూడా ఎంతో పేరు ఉన్నా సామాన్యుల పట్ల ఆయన స్పందించే తీరు అందరినీ ఆకట్టుకుంటుంది. తాజాగా హిమాచల్ ప్రదేశ్‌లో ఓ మొక్కజొన్న వ్యాపారితో ఆయన జరిపిన సరదా సంభాషణ వైరల్ అయ్యింది.

Sonu Sood : వారికి ఇచ్చే నష్టపరిహారం అయిపోయిన తర్వాత? ఒడిశా ప్రమాదంపై సోనూసూద్ సంచలన ట్వీట్..

సోనూ సూద్ హిమాచల్ ప్రదేశ్‌లోని మనాలి నుంచి సిస్సు వైపు ప్రయాణం చేస్తున్నారు. రోడ్డు పక్కన ఆయనకి ఓ మొక్కజొన్న స్టాల్ కనిపించింది. వెంటనే ఆయన అతని దగ్గరకు వెళ్లి మొక్కజొన్న కొనుగోలు చేశారు. మొక్క జొన్న వ్యాపారి పేరు శేష్ ప్రకాష్ నిషాద్.. అతను ఉత్తప్రదేశ్ జాన్ పూర్‌కు చెందినవాడిగా సోనూ సూద్‌కి పరిచయం చేసుకున్నాడు. ఒక్కొక్క మొక్కజొన్న రూ.50 కి విక్రమిస్తున్నానని .. ప్రతిరోజు 100 మొక్కజొన్నల బస్తాను విక్రయిస్తానని సోనూ సూద్‌కి చెప్పుకున్నాడు. అంతేకాదు తనకి నలుగురు సోదరులు ఉన్నారని.. ఒక సోదరి ఉందని చెప్పాడు. తనకు ఇంకా పెళ్లి కాలేదని సోనూ సూద్‌కి చెప్పగానే పెళ్లికొడుకు కోసం వెతుకుతున్నవారు నిషాద్‌‌కు మంచి మ్యాచ్ చెప్పమంటూ సోనూ సూద్ సూచించారు. ఇలా వీరిమధ్య జరిగిన సంభాషణను సోనూ సూద్  @SonuSood స్వయంగా తన ట్విట్టర్ అకౌంట్‌లో షేర్ చేశారు.

Sonu sood: సోనూ సూద్ చేసిన ఆ పనికి మండిపడ్డ రైల్వే శాఖ

చివరికిగా సోనూ సూద్ తనకు, తనతో ఉన్న వారికి మొక్కజొన్నలు కొనుగోలు చేశారు. వీరిద్దరి మధ్య సరదాగా జరిగిన సంభాషణ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. అందరితో ఎటువంటి భేషజం లేకుండా పలకరించే సోనూ సూద్ మంచితనాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.