Ranbir Kapoor : సౌరవ్ గంగూలీ బయోపిక్‌ లో రణ్‌బీర్.. క్లారిటీ ఇచ్చిన నిర్మాతలు..

బాలీవుడ్ లో బయోపిక్ ల ట్రెండ్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ స్టేజిలో ఉన్న బయోపిక్.. భారత దిగ్గజ క్రికెటర్ గంగూలీ బయోపిక్. ఇక ఈ మూవీలో గంగూలీ పాత్రను పోషించేది ఆ హీరో అంటూ రోజుకో వార్త వినిపిస్తూనే ఉంటుంది. ఇటీవల కాలంలో ఈ పాత్రని రణ్‌బీర్ నటించబోతున్నాడు అంటూ బాలీవుడ్ వర్గాల్లో గట్టిగా వార్తలు వినిపించాయి. తాజాగా దీనిపై..

Ranbir Kapoor : సౌరవ్ గంగూలీ బయోపిక్‌ లో రణ్‌బీర్.. క్లారిటీ ఇచ్చిన నిర్మాతలు..

sourav ganguly ranbir

Ranbir Kapoor : బాలీవుడ్ లో బయోపిక్ ల ట్రెండ్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఒకప్పుడు ఈ బయోపిక్ సినిమాలతో బ్లాక్ బస్టర్ విజయాలను అందుకున్నారు బాలీవుడ్ మేకర్స్. కానీ కొంత కాలంగా బయోపిక్ లు కూడా బి-టౌన్ బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా ఆకట్టుకోలేక పోతున్నాయి. అయినా సరే బాలీవుడ్ లో ప్రస్తుతం అరడజనకు పైగా బయోపిక్ లు రిలీజ్ కి సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలోనే అజయ్ దేవగన్ – మైదాన్, ఇషాన్ – పిప్ప, అనుష్క శర్మ – చక్ దే ఎక్స్‌ప్రెస్.. వీటితో పాటు మరికొన్ని చిత్రాలు బయోపిక్ స్టోరీతో ఆడియన్స్ ముందుకు వస్తున్నాయి.

Ranbir Kapoor : అల్లు అర్జున్, చరణ్, ఎన్టీఆర్‌ల నటన పై రణ్‌బీర్ వైరల్ కామెంట్స్..

కాగా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ స్టేజిలో ఉన్న బయోపిక్.. భారత దిగ్గజ క్రికెటర్ గంగూలీ బయోపిక్. గత ఏడాది కాలంగా ఈ మూవీ స్టోరీ, స్క్రీన్ ప్లే సిట్టింగ్స్ జరుగుతూనే ఉన్నాయి. ఇక ఈ మూవీలో గంగూలీ పాత్రను పోషించేది ఆ హీరో అంటూ రోజుకో వార్త వినిపిస్తూనే ఉంటుంది. ఈ నేపథ్యంలోనే హృతిక్ రోషన్, సిద్ధార్థ్ మల్హోత్రా పేరులు వినిపించాయి. ఇటీవల కాలంలో ఈ పాత్రని రణ్‌బీర్ నటించబోతున్నాడు అంటూ బాలీవుడ్ వర్గాల్లో గట్టిగా వార్తలు వినిపించాయి. తాజాగా దీనిపై బయోపిక్ నిర్మిస్తున్న ప్రొడ్యూసర్స్ లో ఒకరు స్పందించారు.

బయోపిక్‌ లో సౌరవ్ గంగూలీ పాత్ర కోసం మేము ఇంకా ఎవర్ని ఎంచుకోలేదు. ఈ మూవీకి సంబంధించిన నటీనటుల మరియు సాంకేతిక నిపుణులను సెలెక్ట్ చేసుకోవడానికి 8-9 నెలలు పడుతుంది. రణ్‌బీర్ కపూర్ ని ఎంపిక చేసాము అన్న వార్తలో నిజం లేదంటూ ఒక మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలియజేశాడు. దీంతో సౌరవ్ గంగూలీ బయోపిక్‌ లో రణ్‌బీర్ నటిస్తున్నాడు అన్న వార్తలకు చెక్ పడింది. కాగా ఈ మూవీ స్క్రిప్ట్‌ను తానే స్వయంగా రచిస్తున్నాడు గంగూలీ. గత ఏడాది ఇండియన్ ఉమెన్ క్రికెట్ మిథాలీ రాజ్ బయోపిక్ తెరకెక్కించిన శ్రీజిత్ ముఖర్జీ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయబోతున్నాడు.