బాలు నోట కరోనాపై పాట..

కరోనా ఎఫెక్ట్ : ఎస్పీ బాలు, వైరముత్తు కలయికలో కరోనాపై పాట..

  • Published By: sekhar ,Published On : March 27, 2020 / 04:05 PM IST
బాలు నోట కరోనాపై పాట..

కరోనా ఎఫెక్ట్ : ఎస్పీ బాలు, వైరముత్తు కలయికలో కరోనాపై పాట..

కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో గత కొద్దిరోజులుగా సినీ పరిశ్రమ ప్రముఖులంతా ఇంటికే పరిమితమయ్యారు. కేంద్ర ప్రభుత్వం 21 రోజులపాటు లాక్‌డౌన్ ప్రకటించిన నేపథ్యంలో నటీనటులు, సాంకేతిక నిపుణులు ఎవరికి వారు తమకు నచ్చిన పనులతో కాలక్షేపం చేస్తున్నారు.

ఈ విరామ సమయాన్ని తమ కుటంబ సభ్యులతో సరదాగా గడుపుతున్నారు. సెల్ఫ్‌ క్వారంటైన్‌లో ఉన్న సెలబ్రిటీలంతా కూడా ఇంట్లో తమ రోజు వారీ పనులను ఫోటోలు, వీడియోల రూపంలో ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తున్నారు. తాజాగా ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం కూడా ప్రజలు సామాజిక దూరం పాటించాలంటూ తన పాట ద్వారా సోషల్‌ మీడియాలో అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు.

కరోనా వ్యాప్తిని ఎలా అరికట్టాలో పాటించాల్సిన విధానాన్ని స్టెప్‌ బై స్టెప్‌ వివరిస్తున్న పాటను సోషల్‌ మీడియాలో శుక్రవారం షేర్‌ చేశారు. తమిళంతో పాటు తెలుగు, కన్నడలోనూ రూపొందించిన ఈ పాటను ప్రముఖ రచయిత వైరముత్తు రాయగా బాలు అద్భుతంగా పాడారు. కరోనా గురించి జాగ్రత్తలు తెలుపుతున్న ఈ పాటలో మంచి ఫీల్ ఉందంటున్నారు నెటిజన్స్..