Sreeleela : విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో భగవంత్ కేసరి టీం.. పట్టుచీరలో శ్రీలీల ఎంత పద్దతిగా ఉందో చూడండి..
భగవంత్ కేసరి సినిమా మంచి విజయం సాధించడంతో ప్రస్తుతం చిత్రయూనిట్ సక్సెస్ టూర్ చేస్తున్నారు.

Sreeleela and Bhagavanth Kesari Movie Team in Vijayawada Kanakadurga Temple
Sreeleela : అనిల్ రావిపూడి(Anil Ravipudi) దర్శకత్వంలో బాలయ్య(Balayya) హీరోగా ఇటీవల దసరాకు వచ్చిన భగవంత్ కేసరి సినిమా భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా దాదాపు 120 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి దూసుకుపోతుంది. ఈ సినిమాలో బాలయ్య మాస్ తో పాటు మంచి మెసేజ్, ఎమోషన్ ఉండటంతో సినిమా మరింత ఎక్కువమందికి రీచ్ అవుతుంది. సినిమా మంచి విజయం సాధించడంతో ప్రస్తుతం చిత్రయూనిట్ సక్సెస్ టూర్ చేస్తున్నారు.
ఈ సక్సెస్ టూర్ లో అనిల్ రావిపూడి, శ్రీలీల, నిర్మాతలు సాహు, హరీష్, పలువురు చిత్రయూనిట్ వెళ్తున్నారు. ప్రస్తుతం ఏపీలో ఈ టూర్ జరుగుతుంది. ఇప్పటికే వైజాగ్, ఏలూరు, రాజమండ్రి థియేటర్స్ కి వెళ్లి చిత్రయూనిట్ సందడి చేయగా నేడు విజయవాడ(Vijayawada) కనకదుర్గమ్మ ఆలయానికి వెళ్లారు. శ్రీలీల పద్దతిగా పట్టుచీర కట్టుకొని ఆలయంలోకి వెళ్ళింది.
Also Read : Bhagavanth Kesari : థియేటర్స్ లో ‘దంచవే మేనత్త కూతురా’ రీమిక్స్ సాంగ్.. బాలయ్య, కాజల్ మాస్ డ్యాన్స్..
ఆలయంలో అమ్మవారికి స్పెషల్ పూజలు చేశారు చిత్రయూనిట్. అనంతరం గుడి బయట మీడియాకు ఫోటోలు ఇవ్వగా ఈ ఫోటోలు వైరల్ గా మారాయి. శ్రీలీల పట్టుచీరలో ఎంత క్యూట్ గా ఉందో, ఎంత ముద్దొస్తుందో అని పలువురు అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
The team of #BhagavanthKesari took the divine blessings of Goddess Kanaka Durga in Vijayawada & addressed the media❤️?
Now heading to Guntur to interact with the audience at Naaz Theatre?
Book your tickets now for the #BLOCKBUSTERBhagavanthKesari ❤️?❤️?#NandamuriBalakrishna… pic.twitter.com/GAev6xziGh
— Shine Screens (@Shine_Screens) October 28, 2023