Sreeleela : డ్యాన్స్ మాత్రమే కాదు సింగింగ్ కూడా.. స్కంద ఈవెంట్లో స్టేజిపై పాటలతో అదరగొట్టిన శ్రీలీల..

ఈ ఈవెంట్లో శ్రీలీల స్పెషల్ అట్రాక్షన్ గా అదరగొట్టింది. ఇన్నాళ్లు శ్రీలీల నటనతో పాటు సూపర్ డ్యాన్సర్ అని పేరు ఉంది. ఇప్పుడు తనలోని మరో ట్యాలెంట్ ని చూపించి మరోసారి ప్రేక్షకులందర్నీ ఆశ్చర్యపరిచింది శ్రీలీల.

Sreeleela : డ్యాన్స్ మాత్రమే కాదు సింగింగ్ కూడా.. స్కంద ఈవెంట్లో స్టేజిపై పాటలతో అదరగొట్టిన శ్రీలీల..

Sreeleela singing in Skanda Movie Pre Release Event

Updated On : August 27, 2023 / 7:42 AM IST

Sreeleela :  రామ్ పోతినేని (Ram Pothineni), బోయపాటి కాంబినేషన్ లో వస్తున్న సినిమా చిత్రం స్కంద‌. శ్రీలీల (Sreeleela), సయీ మంజ్రేకర్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. స్కంద సినిమా సెప్టెంబర్ 15న రిలీజ్ కానుంది. దీంతో చిత్రయూనిట్ ప్రమోషన్స్ మొదలు పెట్టారు. నిన్న శనివారం సాయంత్రం స్కంద ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించగా బాలకృష్ణ ముఖ్య అతిథిగా విచ్చేశారు.

ఈ ఈవెంట్లో శ్రీలీల స్పెషల్ అట్రాక్షన్ గా అదరగొట్టింది. ఇన్నాళ్లు శ్రీలీల నటనతో పాటు సూపర్ డ్యాన్సర్ అని పేరు ఉంది. తన డ్యాన్స్ తో ప్రేక్షకులని ఫిదా చేసింది ఆల్రెడీ. మాస్ డ్యాన్స్ హీరోలకు పోటీగా వారితో కలిసి డ్యాన్స్ వేస్తుండటంతో శ్రీలీల డ్యాన్స్ స్కిల్స్ కి అంతా ఆశ్చర్యపోతున్నారు. ఇప్పుడు తనలోని మరో ట్యాలెంట్ ని చూపించి మరోసారి ప్రేక్షకులందర్నీ ఆశ్చర్యపరిచింది శ్రీలీల.

Boyapati Sreenu : అఖండ 2 పై క్లారిటీ ఇచ్చిన బోయపాటి.. వర్క్ జరుగుతుంది..

స్కంద ప్రీ రిలీజ్ ఈవెంట్ లో థమన్ తో కలిసి స్టేజిపై సాంగ్ పాడింది శ్రీలీల. ఇలాంటి ఈవెంట్స్ లో మ్యూజిక్ డైరెక్టర్ తన టీంతో కలిసి సాంగ్స్ పెర్ఫార్మ్ చేస్తారనే సంగతి తెలిసిందే. స్కంద ఈవెంట్లో కూడా తమన్ తన టీంతో కలిసి ఈ సినిమాలోని సాంగ్స్ ని పెర్ఫార్మ్ చేయగా సినిమాలోని చిట్టి చిట్టి.. అనే సాంగ్ కి శ్రీలీల థమన్ తో కలిసి స్టేజిపై పాడింది. దీంతో శ్రీలీల పాట పాడిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇన్నాళ్లు డ్యాన్స్, నటన, తన అందంతో మెస్మరైజ్ చేసిన శ్రీలీల ఇప్పుడు సింగింగ్ తో కూడా అభిమానులని, ప్రేక్షకులని మెప్పించింది. శ్రీలీల ట్యాలెంట్ ని అంతా పొగిడేస్తున్నారు.