Srikanth : ఊహతో విడాకులపై స్పందించిన శ్రీకాంత్..

టాలీవుడ్ నటుడు శ్రీకాంత్, తన భార్య ఊహకు విడాకులు ఇస్తున్నట్లు వస్తున్న వార్తలపై స్పందించాడు. వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇటీవలే శ్రీకాంత్, ఊహ తమ 25వ పెళ్లి వేడుకులను కూడా ఘనంగా జరుపుకున్నారు. కాగా గత కొన్ని రోజులుగా..

Srikanth : ఊహతో విడాకులపై స్పందించిన శ్రీకాంత్..

Srikanth reacted to the divorce with Ooha

Srikanth : టాలీవుడ్ నటుడు శ్రీకాంత్, తన భార్య ఊహకు విడాకులు ఇస్తున్నట్లు వస్తున్న వార్తలపై స్పందించాడు. ఇ వి వి సత్యనారాయణ తెరకెక్కించిన ‘ఆమె’ సినిమాతో కలుసుకున్న శ్రీకాంత్ అండ్ ఊహ.. ఆ తరువాత కూడా మరో రెండు సినిమాల్లో కలిసి నటించారు. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారడంతో పెద్దల్ని ఒప్పించి వివాహం చేసుకున్నారు ఈ ప్రేమజంట.

Srikanth Son Roshan : మహేష్ మాత్రం ఏం మారలేదు

వీరిద్దరికి ముగ్గురు పిల్లలు.. అందులో ఒకరు ‘రోషన్’ సినీరంగ ప్రవేశం కూడా చేశాడు. కాగా గత కొన్ని రోజులుగా పలు వెబ్‌సైట్‌ల్లో శ్రీకాంత్, ఊహ విడాకులు తీసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఈ వార్తలు చూసిన కుటుంబసభ్యులు మరియు స్నేహితులు శ్రీకాంత్ ని ప్రశ్నించడం మొదలు పెట్టారు. ఇక అందరికి సమాధానం ఇవ్వలేక విసుగుపోయిన ఈ నటుడు.. ఈరోజు మీడియా ముందుకు వచ్చాడు.

విడాకుల వార్తల్లో ఎటువంటి నిజం లేదని చెప్పిన శ్రీకాంత్.. ఈ వార్తలు రాసిన వెబ్‌సైట్‌లు మరియు పలు యూట్యూబ్ ఛానల్స్ పై సైబర్ క్రైమ్ పోలీసులకు పిర్యాదు చేయనున్నాడు. తప్పుడు ప్రచారం చేస్తున్న వెబ్‌సైట్‌లపై చాలా సీరియస్ యాక్షన్ తీసుకుంటానని ప్రకటించాడు శ్రీకాంత్. కాగా ఇటీవలే శ్రీకాంత్, ఊహ తమ 25వ పెళ్లి వేడుకులను కూడా ఘనంగా జరుపుకున్నారు.