SSMB28: మహేష్ బాబు సినిమా ఓటీటీ రైట్స్‌కు భారీ రేటు..?
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రాన్ని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్ట్ చేస్తుండటంతో, ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఈ సినిమాను ఇప్పటికే ప్రారంభించగా, ఈ చిత్ర షూటింగ్ మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఇక రెండో షెడ్యూల్‌ను ఇటీవల స్టార్ట్ చేశారు.

SSMB28: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రాన్ని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్ట్ చేస్తుండటంతో, ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఈ సినిమాను ఇప్పటికే ప్రారంభించగా, ఈ చిత్ర షూటింగ్ మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఇక రెండో షెడ్యూల్‌ను ఇటీవల స్టార్ట్ చేశారు.
SSMB28: నైజాం రైట్స్‌తో దుమ్ములేపిన మహేష్-త్రివిక్రమ్.. నిజమేనా..?
అయితే ఈ సినిమాకు సంబంధించి ఇండస్ట్రీ వర్గాల్లో గతకొద్ది రోజులుగా పలు రకాల వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఈ సినిమాకు సంబంధించి నైజాం రైట్స్ భారీ రేటుకు అమ్ముడైనట్లుగా వార్తలు వస్తుండగా, ఈ విషయంపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉందని సినీ వర్గాలు తెలిపాయి. అయితే తాజాగా, ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ రైట్స్‌ను భారీ రేటుకు అమ్మినట్లుగా తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ మహేష్-త్రివిక్రమ్ మూవీకి సంబంధించిన డిజిటల్ రైట్స్‌ను ఏకంగా రూ.80 కోట్లకు డీల్ సెట్ చేసుకున్నట్లుగా ఫిలిం సర్కిల్స్‌లో వార్తలు వినిపిస్తున్నాయి.
SSMB28 : SSMB28 మూవీ నుంచి అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన నిర్మాత నాగవంశీ..
మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందనే విషయం తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమాలో మహేష్ బాబు సరికొత్త లుక్‌తో కనిపిస్తుండగా, ఈ సినిమా మహేష్ బాబు ఇమేజ్‌ను మరింతగా పెంచేలా ఉండబోతుందని చిత్ర యూనిట్ చెబుతోంది. ఈ సినిమాలో అందాల భామ పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోండగా, థమన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నాడు. హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తోంది.