వైకుంఠపురం ఊపు – టాలీవుడ్ డైరెక్టర్లకి బన్నీ గ్రాండ్ పార్టీ

  • Published By: sekhar ,Published On : February 4, 2020 / 07:22 AM IST
వైకుంఠపురం ఊపు – టాలీవుడ్ డైరెక్టర్లకి బన్నీ గ్రాండ్ పార్టీ

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, పూజా హెగ్డే జంటగా.. త్రివిక్రమ్ దర్శకత్వంలో.. గీతా ఆర్ట్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్.. ‘అల… వైకుంఠపురములో’.. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్, హౌస్‌ఫుల్ కలెక్షన్లతో బాక్సాఫీస్ వద్ద విజయ విహారం చేస్తోంది.

 

ALVP

 

తెలుగు రాష్ట్రాల్లో అన్ని ఏరియాల్లోనూ నాన్ బాహుబలి రికార్డ్ క్రియేట్ చేసింది. ఓవర్సీస్‌లోనూ రికార్డ్ స్థాయి వసూళ్లు రాబట్టింది. బన్నీ కెరీర్‌లో హైయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా ‘అల వైకుంఠపురం’ నిలిచింది. ఈ నేపధ్యంలో బన్నీ టాలీవుడ్ దర్శకులకోసం ఒక అదిరిపోయే పార్టీ ఇచ్చాడు.

 

ఈ పార్టీలో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, నిర్మాత అల్లు అరవింద్‌, త్రివిక్రమ్‌, ‘తొలప్రేమ’ కరుణాకరన్, శ్రీను వైట్ల, విక్రమ్ కె కుమార్, కొరటాల శివ, బొమ్మరిల్లు భాస్కర్, సురేందర్ రెడ్డి, వాసువర్మ, పరశురాం, మెహర్ రమేష్, రవికాంత్ పేరెపు, చందు మొండేటి, మారుతి, మోహనకృష్ణ ఇంద్రగంటి, మధుర శ్రీధర్, రాహుల్ రవీంద్రన్, గౌతమ్ తిన్ననూరి తదితరులతో పాటు పలువురు కో-డైరెక్టర్లు కూడా ఈ పార్టీలో పాల్గొన్నారు. బన్నీ ఇచ్చిన ఈ గ్రాండ్ పార్టీ తాలుకూ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
ALVP