Vijay Devarakonda : 2023లో విజయ్ దేవరకొండ సుకుమార్ సినిమా

సుకుమార్ విజయ్ కాంబినేషన్ లో సినిమా రాబోతున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. ఇవాళ సుకుమార్ పుట్టిన రోజు సందర్భంగా వీళ్ళ సినిమా ఎప్పుడు వస్తుందో చెప్పేసాడు విజయ్. విజయ్ ట్వీట్ చేస్తూ....

Vijay Devarakonda : 2023లో విజయ్ దేవరకొండ సుకుమార్ సినిమా

Vijay Devarakonda

Vijay Devarakonda :  ఇటీవల ‘పుష్ప’ సినిమాతో మరోసారి తన సత్తాని చాటాడు సుకుమార్. లవ్ సినిమాలతో కెరీర్ మొదలు పెట్టి పూర్తిగా మాస్ డైరెక్టర్ గా మారిపోతున్నారు సుకుమార్. ప్రస్తుతం సుకుమార్ ‘పుష్ప పార్ట్ 1’ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. త్వరలో ‘పుష్ప పార్ట్ 2’ షూటింగ్ మొదలు పెట్టనున్నాడు. ఇవాళ సుకుమార్ పుట్టిన రోజు సందర్భంగా సినీ పరిశ్రమకి చెందిన ప్రముఖులు, అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. విజయ్ దేవరకొండ కూడా డైరెక్టర్ సుకుమార్ కి స్పెషల్ బర్త్ డే విషెష్ సోషల్ మీడియా ద్వారా తెలియచేశాడు.

సుకుమార్ విజయ్ కాంబినేషన్ లో సినిమా రాబోతున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. ఇవాళ సుకుమార్ పుట్టిన రోజు సందర్భంగా వీళ్ళ సినిమా ఎప్పుడు వస్తుందో చెప్పేసాడు విజయ్. విజయ్ ట్వీట్ చేస్తూ.. ”సుకుమార్ సర్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు. మీరు ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. మీతో సినిమా చేసేందుకు చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నాను. 2021 లో ది రైజ్, 2022 లో ది రూల్, 2023 లో ది ర్యాంపేజ్.” అంటూ పోస్ట్ చేశారు.

RGV : పేర్ని నానితో భేటీ తర్వాత కూడా మళ్ళీ వరుస ట్వీట్లు పెడుతున్న వర్మ

‘పుష్ప పార్ట్ 1’ సినిమాకి సబ్ టైటిల్ ది రైజ్ ఉంటుంది ‘పుష్ప పార్ట్ 2’కి ది రూల్ అనే సబ్ టైటిల్ పెట్టబోతున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. 2021లో పుష్ప పార్ట్ 1 రిలీజ్ అయింది. 2022 లో పుష్ప పార్ట్ 2 వస్తుందని కూడా తెలిపారు. ఇక 2023 లో విజయ్ సినిమా ది ర్యాంపేజ్ అంటూ చెప్పుకొచ్చాడు విజయ్. దీంతో విజయ్ సుకుమార్ సినిమా 2023లో రాబోతుందని ఫిక్స్ చేసేశారు. అభిమానులు ఈ సినిమా కోసం ఎంతో వెయిట్ చేస్తున్నారు.