Sunil: మళ్ళీ హీరోగా సునీల్.. మరోసారి అదే తప్పు చేస్తున్నాడా?

సినీ పరిశ్రమలో కథానాయకుడు అంటే ఉండే క్రేజే వేరు. కమెడియన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్, నెగటివ్ రోల్ ఇవన్నీ ఒకెత్తు కానీ హీరోకు ఉండే జీల్ వేరేగా ఉంటుంది. అందుకే నటుడిగా ఎంతో కొంత గుర్తింపు తెచ్చుకున్న వాళ్ళు, సీరియల్స్, యాంకర్ల గుర్తింపు తెచ్చుకున్న వాళ్ళు కూడా హీరోగా ప్రయత్నించడం చాలా కామన్ గా కనిపిస్తుంది.

Sunil: మళ్ళీ హీరోగా సునీల్.. మరోసారి అదే తప్పు చేస్తున్నాడా?

Sunil

Sunil: సినీ పరిశ్రమలో కథానాయకుడు అంటే ఉండే క్రేజే వేరు. కమెడియన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్, నెగటివ్ రోల్ ఇవన్నీ ఒకెత్తు కానీ హీరోకు ఉండే జీల్ వేరేగా ఉంటుంది. అందుకే నటుడిగా ఎంతో కొంత గుర్తింపు తెచ్చుకున్న వాళ్ళు, సీరియల్స్, యాంకర్ల గుర్తింపు తెచ్చుకున్న వాళ్ళు కూడా హీరోగా ప్రయత్నించడం చాలా కామన్ గా కనిపిస్తుంది. ఇంతకు ముందు సీనియర్ కమెడియన్ల నుండి క్యారెక్టర్ ఆర్టిస్ట్స్ వరకు ఇలా చాలా మంది ఇప్పటికే వాళ్ళ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు.

Sunil : పుష్ప, F3 ఒకేసారి షూట్.. అందులో విలన్, ఇందులో కమెడియన్.. దూల తీరిపోయింది..

ఈ బాటలోనే కమెడియన్ సునీల్ కూడా కమెడియన్ నుండి హీరోగా టర్న్ అయి ఏకంగా డజను సినిమాలు చేశాడు. అందుకోసం ఏకంగా సిక్స్ ప్యాక్ బాడీని కూడా బిల్డ్ చేసి యాక్షన్ హీరో అనిపించుకున్నాడు. దర్శక ధీరుడు రాజమౌళి మర్యాద రామన్న సినిమాతో మొదలైన సునీల్ హీరో కెరీర్లో మళ్ళీ ఆ స్థాయి సినిమా పడలేదు. దీంతో మెల్లగా మళ్ళీ కమెడియన్ ట్రాక్ లోకి వచ్చేశాడు. అయితే ఈసారి కమెడియన్ గానే కాదు.. విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా బిజీగా మారాడు. ఇప్పుడు కూడా సునీల్ మంచి మంచి పాత్రలే చేస్తున్నాడు.

Sunil : రాజా రవీంద్రతో నాకు ఎలాంటి గొడవ అవ్వలేదు.. కాని.. : సునీల్

అయితే.. ఇప్పుడు సునీల్ మళ్ళీ హీరోగా మరో ప్రయత్నం చేస్తున్నాడా అంటే ఆయనే అవునని సమాధానం చెప్పాడు. సునీల్ కమెడియన్ గా నటించిన వెంకటేష్-వరుణ్ తేజ్ ల మూవీ ఎప్‌-3 రిలీజ్ కి సిద్దమవుతుంది. ఈ చిత్రం ప్రమోషన్స్‌లో భాగంగా రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన సునీల్ త్వరలోనే తాను హీరోగా రీఎంట్రీ ఇస్తున్నానని ఓ మంచి ప్రాజెక్టుతో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు చెప్పాడు. అయితే, హీరోగా నిలదొక్కుకోవడం అంటే సామాన్యమైన విషయం కాదని సునీల్ కి కూడా తెలుసు. మరి అయినా సునీల్ మరోసారి అదే తప్పు చేస్తున్నాడా అని ఇండస్ట్రీలో చర్చలు మొదలయ్యాయి.