Kantara 2: క్రేజీ న్యూస్.. కాంతార-2లో సూపర్ స్టార్.. నిజమేనా?

కన్నడలో తెరకెక్కిన ‘కాంతార’ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను హీరో కమ్ డైరెక్టర్ రిషబ్ శెట్టి తెరకెక్కించిన తీరు ప్రేక్షకులను కట్టిపడేసింది. ఈ సినిమాలోని వైవిధ్యమైన కంటెంట్ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. ఇక ఈ సినిమాలో రిషబ్ పవర్‌ప్యాక్డ్ పర్ఫార్మెన్స్‌కు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఈ సినిమా రిలీజ్ అయిన అన్ని భాషల్లోనూ కళ్లు చెదిరే కలెక్షన్లు రాబట్టి ఔరా అనిపించింది.

Kantara 2: క్రేజీ న్యూస్.. కాంతార-2లో సూపర్ స్టార్.. నిజమేనా?

Superstar Rajinikanth In Kantara 2

Kantara 2: కన్నడలో తెరకెక్కిన ‘కాంతార’ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను హీరో కమ్ డైరెక్టర్ రిషబ్ శెట్టి తెరకెక్కించిన తీరు ప్రేక్షకులను కట్టిపడేసింది. ఈ సినిమాలోని వైవిధ్యమైన కంటెంట్ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. ఇక ఈ సినిమాలో రిషబ్ పవర్‌ప్యాక్డ్ పర్ఫార్మెన్స్‌కు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఈ సినిమా రిలీజ్ అయిన అన్ని భాషల్లోనూ కళ్లు చెదిరే కలెక్షన్లు రాబట్టి ఔరా అనిపించింది.

Kantara 2: కాంతార-2లో బాలీవుడ్ బ్యూటీ.. ఎవరో తెలుసా..?

ఇక కాంతార చిత్రం అందుకున్న ట్రెమెండస్ సక్సెస్‌తో ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని చిత్ర యూనిట్ గతంలోనే వెల్లడించింది. దీంతో ఈ సినిమా సీక్వెల్ ఎప్పుడెప్పుడు పట్టాలెక్కుతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల కాంతార-2 మూవీలో బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌటేలా కూడా నటించబోతున్నట్లుగా చిత్ర యూనిట్ తెలిపింది. అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ బజ్ చిత్ర వర్గాల్లో వినిపిస్తోంది.

Kantara : కాంతార-2 కన్‌ఫార్మ్ చేసిన నిర్మాత.. సీక్వెల్ కాదు ప్రీక్వెల్!

కాంతార-2 చిత్రంలో తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా కనిపిస్తాడనే టాక్ ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. ఇదే విషయంపై ఇటీవల హీరో, డైరెక్టర్ రిషబ్ శెట్టిని ఓ మీడియా ప్రతినిథి ఈ ప్రశ్న అడగ్గా, ఆయన సైలెంట్‌గా పక్కకు వెళ్లిపోయాడట. దీంతో ఈ సినిమాలో ఖచ్చితంగా రజినీకాంత్ నటించబోతున్నాడనే టాక్ నెట్టింట జోరుగా చక్కర్లు కొడుతోంది.