Suresh Babu : వెంకటేష్ కి రెమ్యునరేషన్ ఇవ్వను.. ఆస్తి విడగొట్టలేదు కానీ..

రెమ్యునరేషన్స్ గురించి మాట్లాడుతూ వెంకటేష్, అల్లు అర్జున్ లకి రెమ్యునరేషన్ ఇస్తారా అని అడిగారు బాలయ్యబాబు. సురేష్ బాబు దీనికి సమాధానమిస్తూ.. మా ప్రొడక్షన్ లో వెంకటేష్ సినిమా చేస్తే...............

Suresh Babu : వెంకటేష్ కి రెమ్యునరేషన్ ఇవ్వను.. ఆస్తి విడగొట్టలేదు కానీ..

Suresh Babu comments on venkatesh remunaration

Suresh Babu :  ఆహాలో బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న అన్‌స్టాపబుల్ సీజన్ 2 గ్రాండ్ సక్సెస్ గా దూసుకుపోతుంది. ఇప్పటికే ఈ సీజన్ లో నాలుగు ఎపిసోడ్లు కాగా తాజాగా ఐదో ఎపిసోడ్ ని రిలీజ్ చేశారు. ఐదో ఎపిసోడ్ కి అగ్ర నిర్మాతలు సురేష్ బాబు, అల్లు అరవింద్, అగ్ర దర్శకులు రాఘవేంద్రరావు, కోదండ రామిరెడ్డి వచ్చారు. ఇటీవలే ఈ ప్రోమో రిలీజ్ చేయగా బాగా వైరల్ అవ్వడంతో ఎపిసోడ్ కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూశారు. శుక్రవారం రాత్రి ఈ ఎపిసోడ్ ని ఆహాలో రిలీజ్ చేశారు.

ఇక ఈ ఎపిసోడ్ లో అనేక సినిమా విషయాల గురించి మాట్లాడారు. రెమ్యునరేషన్స్ గురించి మాట్లాడుతూ వెంకటేష్, అల్లు అర్జున్ లకి రెమ్యునరేషన్ ఇస్తారా అని అడిగారు బాలయ్యబాబు. సురేష్ బాబు దీనికి సమాధానమిస్తూ.. మా ప్రొడక్షన్ లో వెంకటేష్ సినిమా చేస్తే సగం రెమ్యునరేషన్ ఇస్తాను. మిగతాది సురేష్ ప్రొడక్షన్ లోకి రాసుకుంటాను. వెంకటేష్ కూడా ఏమనడు, అడగడు. అలాగే మరో ప్రశ్నలో సురేష్ బాబు.. ఆస్తిని మేము విడగొట్టలేదు కానీ ఫుడ్ మాత్రం నేను, వెంకటేష్ సరిగ్గా సగం సగం తీసుకొని తింటాము. లేకపోతే గొడవలు అయిపోతాయి అని అన్నారు.

Theaters Issue : థియేటర్స్ ని ఆ నలుగురే రూల్ చేస్తున్నారు.. అవును అంటూ క్లారిటీ ఇచ్చిన అల్లు అరవింద్, సురేష్ బాబు

ఇక అల్లు అరవింద్ మాట్లాడుతూ.. చిరంజీవి, అల్లు అర్జున్, శిరీష్, మా ఫ్యామిలిలో ఏ హీరో అయినా సరే నేను అందరికి రెమ్యునరేషన్ మొత్తం ఇచ్చాకే సినిమా రిలీజ్ చేస్తాను. వాళ్ళకి రెమ్యునరేషన్ రిలీజ్ కి ముందు రోజు అయినా ఇచ్చేస్తే నాకు మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. మొన్న పుష్ప సమయంలో బన్నీని నార్త్ లో ఒక ఇంటర్వ్యూలో మీ నాన్న దగ్గర రెమ్యునరేషన్ తీసుకుంటారా అని అడిగితే తీసుకుంటాను, మా నాన్నకి ఎక్కువ ప్రాఫిట్స్ వస్తే నాకివ్వరు కదా అన్నాడు అని తెలిపారు.