Andrei Koscheev : శ్రియ భర్తకి సర్జరీ.. పాపని కూడా ఎత్తుకోలేకపోయాడు అంటూ ఎమోషనల్ పోస్ట్..

గత కొంతకాలం నుంచి శ్రియ భర్త ఆండ్రీ హెర్నియాతో భాదపడుతున్నారు. కనీసం పాపని కూడా ఎత్తుకోలేనంతగా బాధ పడుతున్నారు. తాజాగా హైదరాబాద్ అపోలో హాస్పిటల్ లో ఆయనకి సర్జరీ చేశారు.......

Andrei Koscheev : శ్రియ భర్తకి సర్జరీ.. పాపని కూడా ఎత్తుకోలేకపోయాడు అంటూ ఎమోషనల్ పోస్ట్..

Shriya (1)

 

Shriya Saran :  ఒకప్పటి స్టార్ హీరోయిన్ శ్రియ ఇప్పుడు కూడా సినిమాలు చేస్తూ మెప్పిస్తుంది. 2018లో ఫారినర్, వ్యాపారవేత్త ఆండ్రీ కొశ్చీవ్‌ను పెళ్లి చేసుకుంది. గతేడాది తనకి ఒక పాప కూడా ఉందంటూ అందరికి షాకిచ్చింది. ఇక అప్పట్నుంచి తన పాపతో, భర్తతో కలిసి ఉన్న ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ సోషల్ మీడియా ద్వారా అభిమానులకి మరింత దగ్గరగా ఉంటుంది. పెళ్లి, పిల్లలు ఉన్న తర్వాత కూడా ఫ్యామిలీని, సినిమాలని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకి సాగుతుంది.

అయితే గత కొంతకాలం నుంచి శ్రియ భర్త ఆండ్రీ హెర్నియాతో భాదపడుతున్నారు. కనీసం పాపని కూడా ఎత్తుకోలేనంతగా బాధ పడుతున్నారు. తాజాగా హైదరాబాద్ అపోలో హాస్పిటల్ లో ఆయనకి సర్జరీ చేశారు. ఈ సర్జరీ విజయవంతం కావడంతో శ్రియా ఇన్‌స్టాగ్రామ్‌ లో ఎమోషనల్‌ గా పోస్ట్‌ పెట్టింది. చేతికి బ్యాండేజీలతో ఉన్న తన భర్త ఫొటోతో పాటు వారిద్దరూ కలిసి దిగిన ఫోటోలని షేర్ చేసింది.

Yami Gautam : లైంగిక వేధింపుల బాధితుల కోసం ముందుకొచ్చిన యామి గౌతమ్

ఈ ఫోటోలని షేర్ చేస్తూ.. ”నా భర్తకు మంచి చికిత్స అందించిన అపోలో హాస్పిటల్ మేనేజ్మెంట్ కి ధన్యవాదాలు. హెర్నియాతో బాధపడుతున్న ఆండ్రీ సుమారు రెండు నెలల నుంచి మా కూతురు రాధను కూడా ఎత్తుకోలేకపోయాడు. అయితే ఇదంతా గతం. ఇప్పుడు కోలుకున్నాడు. ఇందుకు సహాయపడిన అపోలో ఆస్పత్రి మేనేజ్‌మెంట్‌తో పాటు ఉపాసన కొణిదెల, డాక్టర్‌ రజనీష్‌ రెడ్డికి కృతజ్ఞతలు” అని శ్రియ పోస్ట్ చేసింది.