Bigg Boss 5 : రవికి చాలా దూరంగా ఉండాలి.. ఆనీ మాస్టర్ టాప్ 5 లో ఉండాలి : శ్వేతా వర్మ

స్టేజీ మీద‌కు వ‌చ్చిన శ్వేత‌తో సైన్ గేమ్ ఆడించాడు నాగ్‌. ఆ తర్వాత శ్వేతా కంటెస్టెంట్స్ గురించి మాట్లాడుతూ.. ర‌వి వెరీ స్మార్ట్ అని, అత‌డికి దూరంగా ఉండాల‌ని కంటెస్టెంట్ల‌ను

10TV Telugu News

Bigg Boss 5 : తెలుగు బిగ్ బాస్ సీజన్ 5 ఆరో వారం పూర్తి చేసుకుంది. నిన్న సండే కావడంతో ఎపిసోడ్ అంతా ఫన్ గా నడిచింది. చివర్లో ఎలిమినేషన్ ఉండటంతో మళ్ళీ కాసేపు సీరియస్ గా ఎమోషనల్ గా సాగింది బిగ్ బాస్. మొదట కంటెస్టెంట్స్ ని రెండు గ్రూపులుగా విడగొట్టారు. ఆ రెండు గ్రూపులతో డ్యాన్సులు వేయించారు. గేమ్స్ ఆడించారు.

Movie : హాలీవుడ్ ని ఢీ కొడుతున్న చైనా సినిమా

ఇక ఈ వారం ఎలిమినేషన్ లో ఎవరెవరు సేఫ్ అయ్యారో ఒక్కొక్కరి పేర్లు చెప్తూ వచ్చారు గేమ్స్ మధ్య. ఇక చివరకి సిరి, శ్వేత‌ మిగలడంతో వాళ్ళని గార్డెన్ ఏరియాకు రమ్మన్నాడు నాగార్జున. వారితో అక్కడున్న ఓ బాక్సుని బ‌ద్ద‌లు చేయమని చెప్పి ఆ బాక్స్ లో ఎవ‌రి ఫోటో ఉంటే వాళ్లు సేఫ్, మిగిలిన వాళ్ళు ఎలిమినేట్ అయిపోతారు అని తెలిపాడు. ఆ బాక్స్ బద్దలుకొట్టి తెరిచి చూడ‌గా అందులో సిరి ఫొటో ఉండ‌టంతో ఆమె హౌస్‌లోకి వెళ్ళిపోయింది. శ్వేత ఎలిమినేట్ అయింది. ఇక శ్వేతా హౌస్ నుంచి బయటకి వచ్చి నాగార్జున దగ్గరికి వచ్చింది.

Bigg Boss 5 : కంటెస్టెంట్స్ భవిష్యత్తు బొమ్మల్లో పెట్టిన నాగార్జున

ఇక స్టేజీ మీద‌కు వ‌చ్చిన శ్వేత‌తో సైన్ గేమ్ ఆడించాడు నాగ్‌. ఆ తర్వాత శ్వేతా కంటెస్టెంట్స్ గురించి మాట్లాడుతూ.. ర‌వి వెరీ స్మార్ట్ అని, అత‌డికి దూరంగా ఉండాల‌ని కంటెస్టెంట్ల‌ను హెచ్చ‌రించింది. హౌస్‌లో మాన‌స్ డేంజ‌ర్ అని తెలిపింది. త‌క్కువ మాట్లాడి ఎక్కువ ఆడాల‌ని ఆనీ మాస్ట‌ర్‌కు స‌ల‌హా ఇచ్చింది. నిన్ను టాప్ 5లో చూడాల‌నుకుంటున్నాన‌ని అని తెలిపింది. శ్రీరామ్‌కు త్వ‌ర‌గా రీచార్జ్ చేయాలి అతను కూడా టాప్ 5లో ఉండాలి అంది. విశ్వ గేమ్‌లో దారి తప్పుతున్నాడు కానీ టాస్కుల్లో ట‌ఫ్ కాంపిటీష‌న్ ఇస్తున్నాడ‌ని, అత‌డిని చూస్తుంటే విశ్వ ఒలంపిక్స్‌కు కూడా వెళ్లిపోవ‌చ్చ‌నిపిస్తుంద‌ని, కాజ‌ల్ డెడ్ ఎండ్ అని, మాట మార్చి యూట‌ర్న్ తీసుకుంటుంద‌ని చెప్పింది శ్వేత. అభిప్రాయ‌ప‌డింది. ఇక హౌస్ లో ఉన్న సభ్యులు శ్రీరామ్‌, శ్వేత కోసం ముస్త‌ఫా ముస్త‌ఫా పాట పాడి శ్వేతకి వీడ్కోలు చెప్పారు.