రష్మీ రాకెట్ – మోషన్ పోస్టర్

గుజరాత్‌ అథ్లెట్‌ రష్మీ జీవితం ఆధారంగా.. తాప్సీ టైటిల్‌ రోల్‌ చేస్తున్న ‘రష్మీ రాకెట్‌’.. మోషన్ పోస్టర్‌ రిలీజ్..

  • Published By: sekhar ,Published On : August 31, 2019 / 05:48 AM IST
రష్మీ రాకెట్ – మోషన్ పోస్టర్

గుజరాత్‌ అథ్లెట్‌ రష్మీ జీవితం ఆధారంగా.. తాప్సీ టైటిల్‌ రోల్‌ చేస్తున్న ‘రష్మీ రాకెట్‌’.. మోషన్ పోస్టర్‌ రిలీజ్..

ప్రస్తుతం టాలీవుడ్‌, బాలీవుడ్‌లలో బయోపిక్‌ల ట్రెండ్ నడుస్తోంది. ఇప్పటికే పలు బయోపిక్‌లు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.. ఉత్తరప్రదేశ్‌లో షూటర్ దాదీస్‌గా పేరొందిన మహిళా షూటర్లు చంద్రో తోమర్, ప్రకాశీ తోమర్‌ల బయోపిక్‌ ‘సాండ్‌ కీ ఆంఖ్‌’లో నటిస్తున్న తాప్సీ.. గుజరాత్‌ అథ్లెట్‌ రష్మీ జీవితం ఆధారంగా దర్శకుడు ఆకర్ష్‌ ఖురాన్‌ తెరకెక్కిస్తున్న ‘రష్మీ రాకెట్‌’.. చిత్రంలో టైటిల్‌ రోల్‌ చేస్తుంది.

రీసెంట్‌గా ఈ సినిమా మోషన్ పోస్టర్‌ను సోషల్‌ మీడియా ద్వారా ప్రేక్షకులతో పంచుకుంది తాప్సీ.. గ్రామీణ యువతిగా, ఫాస్ట్ రన్నర్‌గా తాప్సీ కనిపించనుంది. రష్మీ తన పరుగుతో ఎన్నో విజయాలను, ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఇందుకుగానూ గుజరాత్‌ ప్రజలు రష్మీని ‘రాకెట్‌’ అని పిలుస్తుంటారు.

Read Also : సాహో : 1 మిలియన్ దాటేసింది..

దీన్ని ఆధారంగా చేసుకుని దర్శకుడు ‘రష్మీ రాకెట్‌’ పేరుతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఆమె ఫాస్ట్ రన్నర్‌గా ఎదిగే క్రమంలో ఎలాంటి సవాళ్లను ఎదుర్కొంది అనే విషయాలను సినిమాలో చూపించనున్నారు. రోనీ స్క్రూవాలా నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది.