Tabu : అందం కోసం 50 వేలు పెట్టి ఓ క్రీమ్ కొన్నా.. కానీ..

ఎన్నో సినిమాల్లో హీరోయిన్ గా అలరించిన టబు ఇప్పటికి కూడా తన అందంతో అందర్నీ మెప్పిస్తుంది, వరుసగా సినిమాల్లో కూడా నటిస్తుంది. ఇటీవల టబు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఓ ఆసక్తికర విషయాన్ని తెలిపింది. టబు మాట్లాడుతూ.............

Tabu : అందం కోసం 50 వేలు పెట్టి ఓ క్రీమ్ కొన్నా.. కానీ..

Tabu buy a face cream with 50 thousand rupees for beauty

Updated On : September 26, 2022 / 8:28 AM IST

Tabu :  హీరోయిన్స్ గ్లామర్ కోసం పాకులాడతారన్న సంగతి తెలిసిందే. ఒక్కసారి గ్లామర్ తగ్గితే అవకాశాలు తగ్గిపోతాయేమో అనే భయంతో కూడా ఉంటారు. చాలా మంది తమ అందాన్ని మెయింటైన్ చేయడానికి భారీగా ఖర్చుపెడతారు. కొంతమంది హీరోయిన్స్ అయితే చాలా వరకు న్యాచురల్ గానే తమ అందాన్ని కాపాడుకుంటారు. ఇక కొంతమంది హీరోయిన్స్ ఎంత ఏజ్ వచ్చినా వాళ్ళ అందం మాత్రం చెక్కుచెదరదు. సీనియర్ హీరోయిన్ టబు అదే కోవలోకి వస్తుంది.

FNCC Elections : ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ ఎన్నికల్లో బండ్ల గణేష్ ఓటమి.. అధ్యక్షుడిగా కృష్ణ సోదరుడు..

ఎన్నో సినిమాల్లో హీరోయిన్ గా అలరించిన టబు ఇప్పటికి కూడా తన అందంతో అందర్నీ మెప్పిస్తుంది, వరుసగా సినిమాల్లో కూడా నటిస్తుంది. ఇటీవల టబు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఓ ఆసక్తికర విషయాన్ని తెలిపింది. టబు మాట్లాడుతూ.. ”కొన్నేళ్ళక్రితం ఒకసారి నా మేకప్ ఆర్టిస్ట్‌ మీ అందానికి రహస్యం ఏంటి అని నన్ను అడిగింది. నేను ఎలాంటి సీక్రెట్ లేదని చెప్పాను. ఆ తర్వాత తను నాకు ఓ ఫేస్‌క్రీమ్‌ కొనమని సలహా ఇచ్చింది. దాని ఖరీదు రూ.50 వేలు. సరే అని కొన్నాను. ఆ క్రీమ్ కొన్న తర్వాత ఒక్కసారో, రెండు సార్లో వాడాను అంతే. ఆ తర్వాత ఆ క్రీమ్ ని మళ్ళీ వాడలేదు. అసలు నేను అందం కోసం ఎలాంటి క్రీములు, ఫేస్ వాష్ లు వాడను” అని తెలిపింది.