Tamannaah : హీరోలపై తమన్నా వైరల్ కామెంట్స్.. ఆ సీన్స్ చేయడానికి వణుకుతుంటారు..

మిల్కీ బ్యూటీ తమన్నా గత కొన్ని రోజులుగా ఏదో విధంగా వార్తల్లో నిలుస్తూనే ఉంది. తాజాగా హీరోల పై వైరల్ కామెంట్స్ చేసి న్యూస్ లో హెడ్ లైన్ అయ్యింది. ఇటీవల తమన్నా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..

Tamannaah : హీరోలపై తమన్నా వైరల్ కామెంట్స్.. ఆ సీన్స్ చేయడానికి వణుకుతుంటారు..

Tamannaah

Tamannaah : మిల్కీ బ్యూటీ తమన్నా గత కొన్ని రోజులుగా ఏదో విధంగా వార్తల్లో నిలుస్తూనే ఉంది. తాజాగా హీరోల పై వైరల్ కామెంట్స్ చేసి న్యూస్ లో హెడ్ లైన్ అయ్యింది. ప్రస్తుతం ఈ అమ్మడు హిందీ సినిమాలో ఎక్కువుగా కనిపిస్తుంది. తమన్నా నటిస్తున్న హిందీ చిత్రం ‘బోల్ చుడియన్’. షూటింగ్ కంప్లీట్ చేసుకొని విడుదలకు సిద్దమవుతుంది. దీనితో పాటు తెలుగులో చిరంజీవి ‘భోళా శంకర్’ సినిమా. అలాగే మలయా చిత్రం ‘బాంద్రా’ లో నటిస్తుంది. వీటితో పాటు కొన్ని వెబ్ సిరీస్ లో కూడా నటిస్తూ అలరిస్తుంది.

Tamannaah : మరోసారి కెమెరాకి చిక్కిన ప్రేమజంట..

ఇక విషయానికి వస్తే ఇటీవల తమన్నా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘సినిమాలో రొమాంటిక్ సీన్స్, హీరోయిన్ తో సన్నిహితంగా ఉండే సన్నివేశాలు చేయవలసి వచ్చినప్పుడు హీరోయిన్లు కంటే హీరోలు ఎక్కువ జంకుతుంటారు. నేను చాలా మంది హీరోలతో నటించాను. వారిలో చాలా మంది ఆ సన్నివేశాలు వచ్చినప్పుడు వణుకుతూ ఉండడం నేను గమనించాను’ అంటూ వెల్లడించింది. ప్రస్తుతం ఈ కామెంట్స్ వైరల్ గా మారాయి.

కాగా ఇటీవల ఈ భామ ప్రేమ గురించి నెట్టింట పెద్ద చర్చ జరుగుతుంది. బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో తమన్నా ప్రేమలో ఉంది అంటూ పలు కథనాలు వస్తున్నాయి. న్యూ ఇయర్ వేడుకల్లో వీరిద్దరూ ముద్దు పెట్టుకుంటున్న ఒక వీడియో బయటకి రావడంతో.. ఈ విషయం బయట పడింది. అయితే దీని పై తమన్నా, విజయ్ వర్మ ఇప్పటి వరకు స్పందించ లేదు. పైగా ఇద్దరు కలిసి బాలీవుడ్ లో చెట్టపట్టాలు వేసుకొని తిరుగుతున్నారు. అయితే వీరిద్దరూ కలిసి ‘లవ్ స్టోరీస్-2’ సినిమాలో మొదటి సారిగా కలిసి నటించ బోతున్నారు. అందుకనే వీరిద్దరూ సన్నిహితంగా ఉంటున్నారు అని కొంత మంది నెటిజెన్లు అభిప్రాయ పడుతున్నారు.