Nikki Galrani : ప్రముఖ హీరోయిన్ ఇంట్లో చోరీ.. పోలీసులకి ఫిర్యాదు
చెన్నై రాయపేటలోని నిక్కీ గల్రానీ ఇంట్లో ధనుష్ అనే యువకుడు పని చేస్తున్నాడు. ఇటీవల నిక్కీకి చెందిన కొన్ని ఖరీదైన బట్టలు, ఖరీదైన కెమెరా కనిపించలేదు. ఈ సంఘటన తర్వాత ధనుష్ కూడా.......

Nikki
Nikki Galrani : ‘బుజ్జిగాడు’తో తెలుగు ప్రేక్షకులకి పరిచయమైన హీరోయిన్ సంజన గల్రానీ. ఆమె చెల్లెలు నిక్కీ గల్రానీ తమిళ్ లో హీరోయిన్ గా సినిమాలు చేస్తుంది. కోలీవుడ్‌లో నిక్కీ గల్రానీ మంచి గుర్తింపు తెచ్చుకుంది. తమిళ్ లో ‘డార్లింగ్’, ‘వెలయిన్ను వందుట్టా వెల్లైక్కారన్’, ‘కడవుల్ ఇరుక్కన్ కుమారు’, ‘మొట్ట శివ కెట్ట శివ’, ‘హరహర మహాదేవకి’, ‘మరగత నానయం’… లాంటి మరిన్ని తమిళ చిత్రాలతో పాపులర్ అయింది. ఇటీవల తన ఇంట్లో దొంగతనం జరిగిందని పోలీసులకి ఫిర్యాదు చేసింది.
జనవరి 11న తన దగ్గర పనిచేసే 19 ఏళ్ల యువకుడు ధనుష్‌పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది నిక్కీ గల్రానీ. చెన్నై రాయపేటలోని నిక్కీ గల్రానీ ఇంట్లో ధనుష్ అనే యువకుడు పని చేస్తున్నాడు. ఇటీవల నిక్కీకి చెందిన కొన్ని ఖరీదైన బట్టలు, ఖరీదైన కెమెరా కనిపించలేదు. ఈ సంఘటన తర్వాత ధనుష్ కూడా కన్పించలేదు. దీంతో అతనే దొంగతనం చేశాడని భావించి పోలీస్‌లకు ఫిర్యాదు చేసి ధనుష్‌పై తగిన చర్యలు తీసుకోవాలని కోరింది నిక్కీ.
Rakul Preet Singh : రకుల్ నుంచి ఒకే సంవత్సరం ఆరు బాలీవుడ్ సినిమాలు..
కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ధనుష్ తిరుపూర్‌లోని తన స్నేహితుడి ఇంట్లో దాక్కున్నట్లు గుర్తించారు. తిరుపూర్‌లో ధనుష్‌ను అరెస్టు చేసి, అతను దొంగలించిన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. విచారణ కోసం ధనుష్‌ను చైన్నైకి తీసుకొచ్చారు పోలీసులు. అనంతరం దుస్తులు, కెమెరాను తిరిగి నిక్కీ గల్రానీకి అప్పగించారు. అయితే తన వస్తువులు తనకి వచ్చేయడంతో నిక్కీ తన ఫిర్యాదు ఉపసంహరించుకొని ధనుష్ ని క్షమించి వదిలేయమని పోలీసులని కోరింది. పోలీసులు ధనుష్ కి వార్నింగ్ ఇచ్చి వదిలేశారు.