Tamil Nadu: తమిళనాడు ఎన్నికల్లో సత్తాచాటిన హీరో విజయ్ అభిమానులు

తనకు సంబంధం లేదు అని మొదటి నుంచి చెబుతున్నా కూడా తమిళనాడు ఎన్నికల్లో ప్రముఖ హీరో విజయ్ అభిమాన సంఘం నుంచి పోటీ చేసిన వందమందిని స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపించారు అక్కడి ప్రజలు.

Tamil Nadu: తమిళనాడు ఎన్నికల్లో సత్తాచాటిన హీరో విజయ్ అభిమానులు

Vijay (1)

Tamil Nadu: తనకు సంబంధం లేదు అని మొదటి నుంచి చెబుతున్నా కూడా తమిళనాడు ఎన్నికల్లో ప్రముఖ హీరో విజయ్ అభిమాన సంఘం నుంచి పోటీ చేసిన వందమందిని స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపించారు అక్కడి ప్రజలు. రాజకీయాల్లోకి ప్రవేశించి పోటీ చేసిన సీనియర్ నటుడు కమల్ హాసన్ పార్టీ మక్కల్ నీది మయ్యం, సీమన్‌కు చెందిన నామ్ తమిళియార్ పార్టీకి ఒక్క సీటు కూడా రాకపోయినా కూడా విజయ్ అభిమాన సంఘం దళపతి విజయ్ మక్కల్ ఇయక్కమ్(TVMI) వంద సీట్లు గెలుచుకుని సాత్తా చాటింది. 169సీట్లలో పోటీ చేసి 115చోట్ల గెలుపొందారు విజయ్ అభిమానులు.

అధికార డీఎంకే ఎన్నికల్లో తమ ఆధిపత్యాన్ని చాటుకోగా.. ఈ ఎన్నికల్లో విజయ్ పార్టీ గురించి కూడా చర్చనీయాంశం అవుతుంది. అక్టోబర్ 6వ తేదీన మొత్తం 39 యూనియన్లలో పోలింగ్ జరగగా.. మిగిలిన 35 యూనియన్లలో 9న పోలింగ్ జరిగింది. 140 జిల్లా పంచాయతీ వార్డు సభ్యులు, 1,381 పంచాయతీ యూనియన్ వార్డు సభ్యులు, 2,901 గ్రామ పంచాయతీ అధ్యక్షులు, 22,581 గ్రామ పంచాయతీ వార్డు కౌన్సిలర్లు సహా మొత్తం 27,003 పోస్టులకు ఎన్నికలు జరిగాయి.

కాంచీపురం, చెంగల్పట్టు జిల్లాల్లో పెద్ద సంఖ్యలో విజయ్ ఫ్యాన్ క్లబ్ సభ్యులు విజయం సాధించగా.. ప్రతిపక్షం విషయంలో ఆ రాష్ట్రంలో కాస్త స్పేస్ ఉండగా.. విజయ్‌కి అవకాశం ఉందనే చర్చ సాగుతోంది. ఇటీవల ఈ క్లబ్ విషయంలోనే.. విజయ్ తన తల్లిదండ్రులకు నోటీసులు కూడా ఇచ్చారు. విజయ్ తన తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్, తల్లి శోభ సహా 11 మంది నోటీసులు అందుకున్నారు. అయితే, ఈ ఎన్నికల్లో మాత్రం పోటీ చేసేందుకు విజయ్ తన అభిమానులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా చెబుతున్నారు.