Sony Liv : ఫేమస్ పైరసీ సైట్ తమిళ్ రాకర్స్ పై వెబ్ సిరీస్..

సినిమాలని పైరసీ చేసే సైట్స్ లో తమిళ్ రాకర్స్ ఒకప్పుడు చాలా ఫేమస్. సౌత్ సినిమా పరిశ్రమలని భయపెట్టింది ఈ సైట్. తమిళ రాకర్స్ సైట్ పేరు చెప్తేనే నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్............

Sony Liv : ఫేమస్ పైరసీ సైట్ తమిళ్ రాకర్స్ పై వెబ్ సిరీస్..

Tamil Rockerz

Tamil Rockerz :  సినీ పరిశ్రమని వేధించే ప్రధాన సమస్య పైరసీ. పైరసీ వల్ల ఎన్నో సినిమాలు, నిర్మాతలు, సినిమాని నమ్ముకున్న వాళ్ళు నష్టపోయారు. పైరసీ వల్ల కలెక్షన్స్ తగ్గుతున్నాయి. 100 రోజులు ఆడాల్సిన సినిమా 10 రోజులకే పక్కకెళ్లిపోతుంది. ​ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సినిమా రిలీజ్ అయిన రోజే పైరసీ కాపీ వస్తుంది. జనాలు కూడా డబ్బులు ఖర్చు పెట్టడం ఎందుకు అని పైరసీ లోనే చూడటానికి ఇష్టపడుతున్నారు.

గతంలో ఈ పైరసీ మీద పెద్ద పోరాటమే జరిగింది. చాలా పైరసీ సైట్స్ ని బ్లాక్ చేశారు. చాలా మందిని అరెస్ట్ చేశారు. ఎన్ని చేసినా ప్రతి సారి మరింత కొత్తగా పైరసీ వస్తూనే ఉంది. సినిమాలని పైరసీ చేసే సైట్స్ లో తమిళ్ రాకర్స్ ఒకప్పుడు చాలా ఫేమస్. సౌత్ సినిమా పరిశ్రమలని భయపెట్టింది ఈ సైట్. తమిళ రాకర్స్ సైట్ పేరు చెప్తేనే నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్ భయపడేవారు. ఇప్పుడు ఆ తమిళ్ రాకర్స్ సైట్ మీదే వెబ్ సిరీస్ రాబోతుంది.

Alia Bhatt : ప్రెగ్నెన్సీ అనౌన్స్ తర్వాత మొదటి ఫొటోషూట్ చేసిన అలియా భట్

సోని లివ్ ఓటీటీలో తమిళ్‌ రాకర్స్‌పై వెబ్‌ సిరీస్ రానుంది. తమిళ్‌ రాకర్స్ వల్ల నిర్మాతలు ఎదుర్కొన్న కష్టాలను, తమిళ రాకర్స్ పై పోలీసులు, సైబర్ క్రైమ్ చేసిన దాడులు ఈ వెబ్‌ సిరీస్‌లో చూపించనున్నారట. ఈ సిరీస్‌ని ప్రముఖ దర్శకుడు శంకర్‌ శిష్యుడు అరివళగన్‌ డైరెక్షన్‌ చేయనున్నారు. ఇందులో అరుణ్‌ విజయ్‌ లీడ్ రోల్ చేస్తున్నాడు. తమిళ్‌ రాకర్స్‌ పేరుతోనే టైటిల్‌ ప్రకటించడంతో ప్రేక్షకుల్లో ఈ సిరీస్ పై ఆసక్తి నెలకొంది. మరి ఈ సిరీస్ కూడా రిలీజ్ అవ్వగానే తమిళ్ రాకర్స్ సైట్ లో పెడతారేమో చూడాలి.