Vijay : కేసీఆర్‌తో తమిళ స్టార్ హీరో విజయ్ మీటింగ్.. తమిళ రాజకీయ వర్గాల్లో చర్చ

తాజాగా విజయ్ బుధవారం రాత్రి తెలంగాణ సీఎం కేసీఆర్ ని ప్రగతి భవన్ లో మర్యాదపూర్వకంగా కలిసారు. తమిళ సినీహీరో విజయ్ ను, డైరెక్టర్ వంశీ పైడిపల్లిని రాజ్యసభ సభ్యులు.................

Vijay : కేసీఆర్‌తో తమిళ స్టార్ హీరో విజయ్ మీటింగ్.. తమిళ రాజకీయ వర్గాల్లో చర్చ

Vijay (1)

KCR :  గత కొన్ని రోజులుగా తమిళ స్టార్ హీరో విజయ్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తారనే చర్చ జరుగుతూనే ఉంది. ఇప్పటికే ఇటీవల జరిగిన తమిళనాడు మున్సిపల్ ఎన్నికల్లో విజయ్ పార్టీ పేరు మీద గెలిచిన అభిమానులని పిలిచి విజయ్ మాట్లాడటం, ప్రశాంత్ కిశోరె ని విజయ్ కలవడం లాంటి సంఘటనలు చూసి విజయ్ కచ్చితంగా రాజకీయాల్లోకి వస్తారనే చెప్తున్నాయి తమిళ మీడియా. ఇలాంటి సందర్భంలో విజయ్ కేసీఆర్ ని కలవడం ఆసక్తికరంగా మారింది.

Telugu New Films: రాబోయే సినిమాల్లో సందడి చేయనున్న క్రేజీ కపుల్స్!

తాజాగా విజయ్ బుధవారం రాత్రి తెలంగాణ సీఎం కేసీఆర్ ని ప్రగతి భవన్ లో మర్యాదపూర్వకంగా కలిసారు. తమిళ సినీహీరో విజయ్ ను, డైరెక్టర్ వంశీ పైడిపల్లిని రాజ్యసభ సభ్యులు, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మొదలుపెట్టిన జోగినపల్లి సంతోష్ కుమార్ కేసీఆర్ వద్దకు తీసుకెళ్లారు.ఈ సందర్భంగా విజయ్ ని సిఎం కెసిఆర్ శాలువాతో సన్మానించారు. అయితే విజయ్ ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెలుగు, తమిళ సినిమా చేస్తున్నాడు. ఆ షూటింగ్ నిమిత్తం హైదరాబాద్ రాగా కేవలం మర్యాదపూర్వకంగానే కలిశారు అని సినీ వర్గాలు చెప్తుంటే, రాజకీయ చర్చలు కూడా జరిగాయి అని రాజకీయ వర్గాలు అంటున్నాయి.