తేజ సజ్జ, శివానీ రాజశేఖర్‌ల ఫాంటసీ లవ్‌స్టోరీ

  • Published By: sekhar ,Published On : August 23, 2020 / 05:07 PM IST
తేజ సజ్జ, శివానీ రాజశేఖర్‌ల ఫాంటసీ లవ్‌స్టోరీ

Teja Sajja Firstlook: మహతేజ క్రియేషన్స్ బ్యానర్ పై చంద్ర శేఖర్ మొగుల్ల ఎస్.ఒరిజినల్స్ సృజన్ యరబోలు కలిసి నిర్మిస్తున్నసినిమా నుండి హీరో తేజ స‌జ్జ లుక్ రిలీజైంది. ఈ రోజు తేజ పుట్టిన రోజు సందర్భంగా(ఆగ‌స్ట్ 23) సినిమా నుండి హీరో లుక్‌ను రివీల్ చేశారు మేకర్స్. శివానీ రాజశేఖర్ హీరోయిన్‌గా నటిస్తోన్న‌ ఈ సినిమాను మల్లిక్ రామ్ డైరెక్ట్ చేస్తున్నారు. ఫాంటసీ లవ్‌స్టోరీగా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది.

ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ ‘‘ఫాంటసీ లవ్ స్టోరీ నేపథ్యంలో రూపొందుతోన్న చిత్ర‌మిది. డైరెక్టర్ మల్లిక్ రామ్ చెప్పిన కథకు అందరం కనెక్ట్ అయ్యాం..ఎక్కడా రాజీ పడకుండా ఈ చిత్రాన్ని నిర్మించాం. మూవీ చాలా బాగా వచ్చింది. తేజ,శివానీ రాజశేఖర్ ఇందులో లీడ్ రోల్స్ చేశారు..షూటింగ్ అంతా కంప్లీట్ అయింది.ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జ‌రుగుతున్నాయి. ప్రస్తుత పరిస్థితులు చక్కబడిన తర్వాత మూవీని రిలీజ్ చేస్తాం’’ అన్నారు.

Teja Sajja