Rahul Ramakrishna: తండ్రి కాబోతున్న టాలీవుడ్ స్టార్ కమెడియన్.. అసలు పెళ్లి ఎప్పుడైంది అంటున్న నెటిజెన్లు..
తెలుగు స్టార్ కమెడియన్ రాహుల్ రామకృష్ణ తండ్రి కాబోతున్నట్లు ప్రకటించాడు. విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన అర్జున్ రెడ్డి సినిమాతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ నటుడు, తన స్నేహితురాలు హరితను పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించాడు. గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్న ఈ జంట ఇటీవలే ఎంగేజ్ మెంట్ జరుపుకున్నట్లు ప్రకటించాడు రాహుల్. అయితే తాజాగా అతను తండ్రి కాబోతున్నట్లు..

Tollywood star comedian Rahul Ramakrishna going to be a father
Rahul Ramakrishna: తెలుగు స్టార్ కమెడియన్ రాహుల్ రామకృష్ణ తండ్రి కాబోతున్నట్లు ప్రకటించాడు. ‘జయము నిశ్చయమ్మురా’ సినిమాతో తెలుగుతెరకు పరిచయమైనా ఈ నటుడు, విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన అర్జున్ రెడ్డి సినిమాతో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఈ సినిమాకు గాను బెస్ట్ కమెడియన్ గా సైమా అవార్డను కూడా అందుకున్నాడు. ఆ తరువాత ‘గీతా గోవిందం’, ‘బ్రోచేవారెవరురా’, ‘జాతిరత్నాలు’ సినిమాతో స్టార్ కమెడియన్ గా ఎదిగాడు.
Rahul Ramakrishna: లిప్ లాక్ ఫోటో పోస్ట్ చేసి పెళ్లి వార్త చెప్పిన కమెడియన్!
ఇటీవలే ఈ నటుడు తన స్నేహితురాలు హరితను పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించాడు. గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్న ఈ జంట ఇటీవలే ఎంగేజ్ మెంట్ జరుపుకున్నట్లు ప్రకటించాడు రాహుల్. అయితే తాజాగా అతను తండ్రి కాబోతున్నట్లు సోషల్ మీడియాలో మరో పోస్ట్ పెట్టాడు. రాహుల్ భార్య ప్రెగ్నెంట్ గా ఉన్న ఒక ఫోటోని షేర్ చేయగా, ఆ పోస్ట్ చూసిన నెటిజెన్లు షాక్ గురవుతున్నారు.
అసలు వీరిద్దరికి పెళ్లి ఎప్పుడు అయిందంటూ ప్రశ్నలు సంధిస్తున్నారు. వీరిద్దరి పెళ్లి గురించి ఎటువంటి ప్రకటన గాని, దాని గురించి ఎటువంటి వార్త గాని వినిపించకపోవడం, హఠాత్తుగా తల్లిదండ్రులు కాబోతున్నట్లు ప్రకటించడంతో.. సహజీవనం చేస్తుండచ్చు అంటూ కొందరు కామెంట్లు చేస్తుండగా, మరికొందరు మాత్రం పెళ్లి గురించి అందరికి చెప్పాల్సిన అవసరం లేదుగా అని ప్రశ్నిస్తున్నారు. ఏదేమైనా అమ్మానాన్నలు కాబోతున్న ఆ జంటకు కంగ్రాట్స్ చెబుతున్నారు అభిమానులు.
Say hello to our little friend pic.twitter.com/q7t5htIZEO
— Rahul Ramakrishna (@eyrahul) November 7, 2022