Dil Raju : నిర్మాత దిల్ రాజు ఇంట తీవ్ర విషాదం..

టాలీవుడ్ బడా నిర్మాత దిల్ రాజు తండ్రి శ్యాంసుందర్ రెడ్డి కొన్ని నిముషాలు క్రిందట కన్నుమూశారు.

Dil Raju : నిర్మాత దిల్ రాజు ఇంట తీవ్ర విషాదం..

Tollywood stra producer Dil Raju father passed away

Updated On : October 9, 2023 / 9:34 PM IST

Dil Raju : టాలీవుడ్ బడా నిర్మాత దిల్ రాజు.. ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆయన తండ్రి శ్యాంసుందర్ రెడ్డి కొన్ని నిముషాలు క్రిందట కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంగా బాధ పడుతున్న శ్యాంసుందర్ రెడ్డి.. నేడు సోమవారం రాత్రి ఎనిమిది గంటల సమయంలో తుది శ్వాస విడిచారు. ప్రస్తుతం ఆయన వయసు 86 సంవత్సరాలు. శ్యాంసుందర్ రెడ్డి, ప్రమీలమ్మ దంపతులకు ముగ్గురు పిల్లలు. వారిలో ఒకరే దిల్ రాజు. మిగిలిన ఇద్దరు విజయ్ సింహారెడ్డి, నరసింహారెడ్డి. దిల్ రాజు అసలు పేరు వెంకటరమణారెడ్డి.

Also read : Akshay Kumar : మాట తప్పలేదు.. పాన్ మసాలా యాడ్‌పై అక్షయ్ కుమార్ కౌంటర్ ట్వీట్..

అయితే చిన్నతనం నుంచి కుటుంబంలోని వారంతా రాజు అని పిలవడంతో రాజు పేరు అందరికి అలవాటు అయ్యింది. ఆ తరువాత నిర్మాతగా తెరకెక్కించిన మొదటి మూవీ ‘దిల్’ సూపర్ హిట్ అవ్వడంతో.. దిల్ రాజుగా ఆడియన్స్ కి బాగా రిజిస్టర్ అయ్యిపోయాడు. ప్రస్తుతం ఇండస్ట్రీలో టాప్ ప్రొడ్యూసర్ గా కొనసాగుతున్నాడు.