Urfi Javed : అలాంటి బట్టలు వేసుకుంటే చంపేస్తాం.. ఉర్ఫీకి బెదిరింపులు.. ఫైర్ అయిన ఉర్ఫీ జావేద్..

బాలీవుడ్ భామ ఉర్ఫీ జావేద్ గురించి అందరికి తెలిసిందే. తాను వేసుకునే బట్టలతోనే ఎక్కువగా ఫేమ్ తెచ్చుకుంది ఉర్ఫీ. ఆల్మోస్ట్ తన బాడీ అంతా కనిపించేలా కేవలం...............

Urfi Javed : అలాంటి బట్టలు వేసుకుంటే చంపేస్తాం.. ఉర్ఫీకి బెదిరింపులు.. ఫైర్ అయిన ఉర్ఫీ జావేద్..

Urfi Javed fires on trollers

Urfi Javed :  బాలీవుడ్ భామ ఉర్ఫీ జావేద్ గురించి అందరికి తెలిసిందే. తాను వేసుకునే బట్టలతోనే ఎక్కువగా ఫేమ్ తెచ్చుకుంది ఉర్ఫీ. ఆల్మోస్ట్ తన బాడీ అంతా కనిపించేలా కేవలం ప్రైవేట్ పార్టులు మాత్రమే దాస్తూ కొత్త కొత్త డ్రెస్సులు వేస్తూ హడావిడి చేస్తుంది ఉర్ఫీ. పేపర్లు, సంచులు, గ్లాస్ ముక్కలు, కర్టెన్, బ్లేడ్లు.. ఇలా రకరకాల మెటీరియల్స్, వస్తువులతో చిత్ర విచిత్రమైన డ్రెస్సులు వేసి హంగామా చేస్తుంది. బయటకి ఎక్కడికి వచ్చినా అలాగే వచ్చి అందరికి షాకిస్తుంది.

తనకేమి ఆ డ్రెస్సులతో, తన బాడీ ఎక్స్‌పోజింగ్ తో ప్రాబ్లమ్ లేకపోయినా తన చుట్టూ ఉన్నవాళ్ళకి అది కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. ఉర్ఫీ జావేద్ మాత్రం ఇదేమి పట్టించుకోదు. చాలా మంది నటీమణులు పొట్టి పొట్టి బట్టలు వేసినా ఉర్ఫీ జావేద్ లా మాత్రం ఎవరూ వేయరు. ఇప్పటికే గతంలో కొన్ని సార్లు ఈ డ్రెస్సులు విషయంలో ఉర్ఫీ జావేద్ ని బెదిరించారు. తాజాగా మరోసారి ఉర్ఫీ జావేద్ ని చంపేస్తామంటూ బెదిరింపులు వస్తున్నాయి.

Vishal : మరోసారి పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన విశాల్.. ఆ బిల్డింగ్ కట్టాకే పెళ్లి చేసుకుంటా..

ఉర్ఫీ జావేద్ కి తెలిసిన వాళ్లలోనే ఓ వ్యక్తి ఇటీవల ఉర్ఫీ జావేద్ ని సరిగ్గా బట్టలు వేసుకోమని, ఇలా మొత్తం విప్పుకొని తిరగొద్దని వార్నింగ్ ఇస్తూ, ఇలా చేస్తే చంపేస్తామని బెదిరించాడు. తాజాగా దీనిపై ఉర్ఫీ జావేద్ సీరియస్ అయింది. ఆ వ్యక్తి అన్న మాటలని తన సోషల్ మీడియాలో షేర్ చేసి.. గతంలో ఇతను నాతో మంచిగానే ఉన్నాడు. అతనికి నేను ఫేవర్ చేయకపోవడంతో ఇలా మాట్లాడుతున్నాడు. అయినా ఎలాంటి బట్టలు వేసుకోవాలో మా ఇష్టం. నువ్వెవరు చెప్పడానికి. నేను ఇలాగే తిరుగుతాను అంటూ ఫైర్ అయింది. దీంతో మరోసారి ఉర్ఫీ జావేద్ బాలీవుడ్ లో వైరల్ గా మారింది.