వకీల్ సాబ్ సెన్సార్ పూర్తయ్యింది.. ఏప్రిల్ 9న విడుదల

వకీల్ సాబ్ సెన్సార్ పూర్తయ్యింది.. ఏప్రిల్ 9న విడుదల

Vakeel

హిందీ జాతీయ అవార్డు సినిమా పింక్ రీమేక్.. వకీల్ సాబ్.. పవన్ కళ్యాణ్ హీరోగా.. చాలా గ్యాప్ తర్వాత వస్తోన్న సినిమా ఇది. అజ్ఞాతవాసి తర్వాత మూడేళ్ల గ్యాప్ తీసుకుని పవన్ కళ్యాణ్ వెండితెరపై రీఎంట్రీ ఇచ్చిన సినిమా వకీల్ సాబ్.. సెన్సార్ కార్యక్రమాలను లేటెస్ట్‌గా పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు సెన్సార్ పూర్తయ్యాక యూ/ఏ సర్టిఫికేట్ అందజేసినట్లుగా చిత్రయూనిట్ ప్రకటించింది.

మధ్య తరగతికి చెందిన ముగ్గురు అమ్మాయిలు అనుకోకుండా ఓ కేసులో చిక్కుకోగా.. వాళ్లను కాపాడేందుకు లాయర్ ఎటువంటి ప్రయత్నాలు చేశాడనే కథతో ఈ చిత్రం రూపొందింది. ఈ మూవీ రన్ టైమ్ 154 నిమిషాలుగా ఉందనే టాక్ వినిపిస్తోంది. హిందీ, తమిళంతో పోలిస్తే తెలుగులో మూవీ రన్ టైమ్ ఎక్కువగా ఉందట. దీనికి కారణం ఇందులో హీరోయిన్ శృతి హాసన్ పాత్ర ఉండడమే అనేది టాక్.

ఈ సినిమాను బోనీ కపూర్ సమర్పణలో దిల్ రాజు నిర్మించగా.. థమన్ సంగీతం అందించారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి విశేషమైన స్పందన వచ్చింది. సినిమా ఏప్రిల్ 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.