Puri Jagannadh : టెంపర్ సినిమాపై వక్కంతం వంశీ వ్యాఖ్యలు.. పూరీని ట్రోల్ చేస్తున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్..

టెంపర్ సినిమాకి వక్కంతం వంశీ రచయిత అనే సంగతి తెలిసిందే. వరుస ఫ్లాప్స్ తర్వాత పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన టెంపర్ సినిమా ఎన్టీఆర్ కి భారీ కంబ్యాక్ ఇచ్చింది. ఈ సినిమా గురించి వక్కంతం వంశీ మాట్లాడుతూ పూరిపై సంచలన వ్యాఖ్యలు చేశాడు...........

Puri Jagannadh : టెంపర్ సినిమాపై వక్కంతం వంశీ వ్యాఖ్యలు.. పూరీని ట్రోల్ చేస్తున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్..

vakkantham vamshi comments on puri jagannadh regarding temper movie

Updated On : November 27, 2022 / 11:44 AM IST

Puri Jagannadh :  తెలుగులో కిక్, టెంపర్ లాంటి సూపర్ హిట్ సినిమాలకి రచయితగా పనిచేసిన వక్కంతం వంశీ నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమాతో దర్శకుడిగా మారారు. రచయితగా బ్లాక్ బస్టర్స్ కొట్టినా దర్శకుడిగా మొదటి సినిమాతో విజయాన్ని అందుకోలేకపోయారు. తాజాగా వక్కంతం వంశీ అలీతో సరదాగా షోకి వచ్చారు. ఈ షోలో సినిమాల గురించి, తన పర్సనల్ విషయాల గురించి మాట్లాడారు.

అయితే టెంపర్ సినిమాకి వక్కంతం వంశీ రచయిత అనే సంగతి తెలిసిందే. వరుస ఫ్లాప్స్ తర్వాత పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన టెంపర్ సినిమా ఎన్టీఆర్ కి భారీ కంబ్యాక్ ఇచ్చింది. ఈ సినిమా గురించి వక్కంతం వంశీ మాట్లాడుతూ పూరిపై సంచలన వ్యాఖ్యలు చేశాడు.

వక్కంతం వంశీ మాట్లాడుతూ.. స్టోరీ చర్చలు జరుగుతున్నప్పుడు క్లైమాక్స్ గురించి పూరి జగన్నాధ్ చెప్తూ CD ఖాళీగా ఉంది అని చెప్పగానే వెంటనే ఆ నలుగురిని కోర్ట్ బయటకి తీసుకొచ్చి హీరో కొట్టి చంపేస్తాడు, అక్కడికి సినిమా అయిపోద్ది అని చెప్పాడు. కానీ అది నేను ఒప్పుకోలేదు. ఒక రచయితగా అది చాలా సింపుల్ గా ఉంటుంది అనిపించింది. ఆ తర్వాత హీరో నేరం తనపై వేసుకుంటాడు అని నేను రాసిన క్లైమాక్స్ చెప్పాను, దానికి ఎన్టీఆర్ కూడా ఒప్పుకున్నాడు అని తెలిపాడు.

Prabhas : ఆదిపురుష్‌ని వెనక్కి నెట్టిన సలార్ ??

దీంతో ఒకవేళ పూరి జగన్నాధ్ పెట్టిన క్లైమాక్ పెట్టి ఉంటే సినిమా పోయేదని, ఫ్లాప్ అయ్యేదని, అసలు పూరి జగన్నాధ్ అంత సింపుల్ గా ఎలా ఆలోచించాడు అని, ఎన్టీఆర్ కి ఇంకో ఫ్లాప్ ఇద్దామనుకున్నావా అంటూ ఎన్టీఆర్ అభిమానులు సోషల్ మీడియాలో పూరి జగన్నాధ్ ని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. మరి దీనిపై పూరి ఏమైనా స్పందిస్తాడేమో చూడాలి.