మళ్లీ వాయిదా పడ్డ వాల్మీకి

మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా, హరీష్ శంకర్  డైరెక్షన్‌లో రూపొందుతున్న వాల్మీకి విడుదల వాయిదా.. సెప్టెంబర్ 20న గ్రాండ్ రిలీజ్..

  • Published By: sekhar ,Published On : August 27, 2019 / 12:43 PM IST
మళ్లీ వాయిదా పడ్డ వాల్మీకి

మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా, హరీష్ శంకర్  డైరెక్షన్‌లో రూపొందుతున్న వాల్మీకి విడుదల వాయిదా.. సెప్టెంబర్ 20న గ్రాండ్ రిలీజ్..

మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా, హరీష్ శంకర్  డైరెక్షన్‌లో, 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై, రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మిస్తున్న సినిమా వాల్మీకి.. తమిళ్ సూపర్ హిట్‌ జిగర్తాండాకు అఫీషియల్ రీమేక్ అనే సంగతి తెలిసిందే. బాబీ సింహా రోల్ వరుణ్ తేజ్ చేస్తుండగా, సిద్దార్థ్ చేసిన క్యారెక్టర్‌లో యంగ్ తమిళ హీరో అధర్వ నటిస్తున్నాడు. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించనుంది. ఇటీవల విడుదల చేసిన టీజర్ అండ్ సాంగ్‌కి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని సెప్టెంబర్ 13న విడుదల కావాల్సిన వాల్మీకిని మరోసారి వాయిదా వేశారు నిర్మాతలు.

మొదట సెప్టెంబర్ 6న రిలీజ్ చెయ్యాలనుకున్నారు. వేరే సినిమాలతో కాంపిటీషన్ కారణంగా డేట్ విషయంలో వెనక్కితగ్గి సెప్టెంబర్ 13కి షిఫ్ట్ అయ్యారు. అదే రోజు నాని నటించిన ‘గ్యాంగ్ లీడర్’ విడుదల కానుండడంతో, రెండు సినిమాల నిర్మాతలు చర్చించుకున్నారు.. క్లాష్ ఎందుకని భావించి తమ సినిమాని పోస్ట్ పోన్ చేస్తున్నట్టు, సెప్టెంబర్ 20న విడుదల చెయ్యనున్నట్టు వాల్మీకి నిర్మాతలు ప్రకటించారు.

Read Also : దీపావళికి విజయ్‌తో ఢీ కొట్టబోతున్న కార్తీ..

ఈ సందర్భంగా రిలీజ్ డేట్‌తో కూడిన న్యూ పోస్టర్స్ కూడా విడుదల చేశారు.. కథ : కార్తీక్ సబ్బరాజ్, స్ర్కీన్ ప్లే : మధు, చైతన్య, కెమెరా : అయాంక బోస్, సంగీతం : మిక్కీ జె మేయర్, ఎడిటింగ్ : చోటా కె.ప్రసాద్, ఆర్ట్ : అవినాష్ కొల్లా, ఫైట్స్ : రామ్-లక్ష్మణ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : హరీష్ కట్టా.