Varisu : ఇది పక్కా తమిళ సినిమా.. తెలుగులోకి డబ్ చేస్తున్నాం.. విజయ్ సినిమాపై క్లారిటీ ఇచ్చిన వంశీ పైడిపల్లి..

తాజాగా వంశీపైడిపల్లి ఓ తమిళ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ సినిమా గురించి పలు విషయాలని తెలియచేశారు. వంశీ పైడిపల్లి మాట్లాడుతూ..............

Varisu : ఇది పక్కా తమిళ సినిమా.. తెలుగులోకి డబ్ చేస్తున్నాం.. విజయ్ సినిమాపై క్లారిటీ ఇచ్చిన వంశీ పైడిపల్లి..

Vamshi Paidipalli gives clarity on Varisu Movie

Varisu :  డైరెక్టర్ వంశీ పైడిపల్లి ప్రస్తుతం తమిళ్ స్టార్ హీరో విజయ్ తో ఓ సినిమా చేస్తున్నారు. దిల్ రాజు ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. సినిమా ప్రారంభం టైంలో ఇది తెలుగు, తమిళ్ లో తెరకెక్కుతోందని, బైలింగ్వల్ సినిమా అని ప్రకటించారు.

తాజాగా వంశీపైడిపల్లి ఓ తమిళ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ సినిమా గురించి పలు విషయాలని తెలియచేశారు. వంశీ పైడిపల్లి మాట్లాడుతూ.. ”ఓ రోజు దిల్ రాజు గారు నాకు ఫోన్ చేసి మన దగ్గర కథ ఉంది కదా, అది విజయ్ కి చెప్తావా అని అడగడంతో ఓకే అన్నాను. దిల్ రాజు విజయ్ సర్ అపాయింట్మెంట్ తీసుకొని నన్ను పంపించారు. చెన్నైలో మధ్యాహ్నం మూడింటికి దిగి విజయ్ సర్ ఇంటికి వెళ్ళాను. సినిమా ఓకే అవ్వకపోయినా విజయ్ గారిని కలిసినట్టు ఉంటుంది అనుకున్నాను. విజయ్ సర్ వచ్చి గంట సేపు కథ విన్నారు. ఆ గంట సేపు భయపడుతూనే కథ చెప్పాను. కథ చెప్పడం పూర్తయ్యాక అయిదు నిమిషాల దాకా విజయ్ గారు మాట్లాడకపోవడంతో ఈ సినిమా వర్కౌట్ ఎవ్వడు అనుకున్నాను. కానీ విజయ్ గారు ఈ సినిమా చేద్దాం అని చెప్పడంతో నేను ఆశ్చర్యపోయాను. రాత్రి 9 గంటలకి మళ్ళీ రిటర్న్ అయ్యాను. ఆరు గంటల్లో చెన్నైలో విజయ్ సార్ తో సినిమా సాధించాను. ఎవరైనా ఇంతకంటే ఎక్కువగా సాధించగలరా అనుకున్నాను” అని తెలిపారు.

NTR : మా దేశంలో చరణ్ వాళ్ళ నాన్న గొప్ప డ్యాన్సర్.. జపాన్ లో చిరంజీవిపై ఎన్టీఆర్ ప్రశంశలు..

అయితే ఈ సినిమా తెలుగు సినిమానా? తమిళ సినిమానా అనే దానిపై చాలా మందికి డౌట్ ఉంది దానికేమంటారు అని అడగ్గా వంశీ మాట్లాడుతూ.. ”వరిసు సినిమా పక్కా తమిళ సినిమా. తమిళ్ లో తీసి తెలుగు, వేరే భాషల్లోకి డబ్ చేసి రిలీజ్ చేస్తామని” దీనిపై క్లారిటీ ఇచ్చారు. ఇన్నాళ్లు ఇది తెలుగు సినిమా అనుకున్న వాళ్ళకి ఇలా క్లారిటీ ఇచ్చాడు వంశీ.