NTR : మా దేశంలో చరణ్ వాళ్ళ నాన్న గొప్ప డ్యాన్సర్.. జపాన్ లో చిరంజీవిపై ఎన్టీఆర్ ప్రశంశలు..

ఎన్టీఆర్ మాట్లాడుతూ.. ''డ్యాన్స్ అనేది ఇండియా వాళ్ళ బ్లడ్ లో ఉంటుంది. అక్కడ ఎన్నో రకాల డ్యాన్సులు ఉన్నాయి. గొప్ప గొప్ప డ్యాన్సర్లు, కొరియోగ్రాఫర్స్ ఉన్నారు. చాలా మంది............

NTR : మా దేశంలో చరణ్ వాళ్ళ నాన్న గొప్ప డ్యాన్సర్.. జపాన్ లో చిరంజీవిపై ఎన్టీఆర్ ప్రశంశలు..

NTR praises Chiranjeevi in japan

NTR :  RRR సినిమాని జపాన్ లో కూడా రిలీజ్ చేసి చిత్ర యూనిట్ అక్కడ కూడా భారీగా ప్రమోషన్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఒక వారం రోజులుగా చరణ్, ఎన్టీఆర్, రాజమౌళి జపాన్ లో RRR ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు. అక్కడి జపాన్ ఫ్యాన్స్ ని కలిసి వారితో మాట్లాడుతున్నారు. జపాన్ ప్రేక్షకులు కూడా వీరిపై అమితంగా ప్రేమని చూపిస్తున్నారు.

చరణ్, ఎన్టీఆర్, రాజమౌళి అక్కడ కూడా వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ ని ఇండియన్స్ డ్యాన్స్ గురించి, ఎన్టీఆర్ డ్యాన్స్ గురించి అడగ్గా ఎన్టీఆర్ ఆసక్తికర సమాధానం ఇచ్చారు.

ఆర్ఆర్ఆర్: “RRR”తో మరోమారు ఇంటర్నేషనల్ అవార్డుని అందుకున్న రాజమౌళి..

ఎన్టీఆర్ మాట్లాడుతూ.. ”డ్యాన్స్ అనేది ఇండియా వాళ్ళ బ్లడ్ లో ఉంటుంది. అక్కడ ఎన్నో రకాల డ్యాన్సులు ఉన్నాయి. గొప్ప గొప్ప డ్యాన్సర్లు, కొరియోగ్రాఫర్స్ ఉన్నారు. చాలా మంది చిన్నప్పట్నుంచి డ్యాన్స్ నేర్చుకుంటారు. నేను కూడా అంతే. చరణ్ వాళ్ళ నాన్న చిరంజీవి గారు మా దేశంలో గొప్ప డ్యాన్సర్. అలాగే ప్రభుదేవా అని గొప్ప కొరియోగ్రాఫర్ ఉన్నారు. అతన్ని మేము ఇండియన్ మైకేల్ జాన్సన్ అని పిలుస్తాము. అలాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకొనే మేము డ్యాన్స్ చేస్తున్నాము” అని చెప్పారు. జపాన్ లో ఎన్టీఆర్ చిరంజీవి గురించి గొప్పగా చెప్పడంతో ఈ వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి.