కొవిడ్ పాజిటివ్‌తో బాధపడుతున్న కూలీ నెం.1 ధావన్

కొవిడ్ పాజిటివ్‌తో బాధపడుతున్న కూలీ నెం.1 ధావన్

Varun Dhawan: బాలీవుడ్ యాక్టర్ వరుణ్ ధావన్ కు కరోనా వైరస్ పాజిటివ్ వచ్చింది. సోమవారం ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ విషయాన్ని కన్ఫామ్ చేశాడు కూలీ నెం.1 వరుణ్. పఈ క్రమంలో పోస్టు పెట్టిన వరుణ్.. ‘మహమ్మారి సమయంలో సినిమా పనుల్లో భాగంగా వెళ్తుంటే కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. ప్రొడక్షన్ వాళ్ల దగ్గర్నుంచి అన్ని జగాగ్రత్తలు పాటిస్తూనే ఉన్నాం.

ఇంకొంచెం ఎక్కువ జాగ్రత్త తీసుకుని ఉంటే బాగుండేది. గెట్ వెల్ మెసేజెస్ రిసీవ్ చేసుకుంటూనే ఉన్నా. రోజూ అవి నాలో కొత్త ఉత్సాహం నింపుతున్నాయి. థ్యాంక్యూ’ అని పోస్టు పెట్టాడు.



చంఢీగడ్‌లో వేసిన సెట్స్ లో జగ్ జగ్గ్ జీయో సెట్స్ లో వరుణ్ ధావన్, నీతూ కపూర్, అనిల్ కపూర్, డైరక్టర్ రాజ్ మెహతాలు ఉండగా కరోనా వైరస్ పాజిటివ్ అంశం కలకలం రేపింది. అనిల్ కపూర్ డిసెంబర్ 4న టెస్టులు చేయించుకుని తనకు నెగెటివ్ వచ్చినట్లుగా ట్విట్టర్లో వెల్లడించారు.

ఈ సెట్స్ కు వెళ్లముందు నీతూ కపూర్ తాను కరోనా టెస్టు చేయించుకున్నానని సేఫ్ గా ఉన్నానంటూ ఓ ఫొటో పోస్టు చేసింది.