Standup Rahul : వరుణ్‌తేజ్ చీఫ్ గెస్ట్‌గా రాజ్‌తరుణ్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్..

. తాజాగా స్టాండప్ రాహుల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఇవాళ బుధవారం నిర్వహించనున్నారు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు...

Standup Rahul : వరుణ్‌తేజ్ చీఫ్ గెస్ట్‌గా రాజ్‌తరుణ్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్..

Raj Tarun

Varun Tej :  రాజ్ తరుణ్ హీరోగా, వర్ష బొల్లమ్మ హీరోయిన్ గా సాంటో మోహన్ వీరంకి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘స్టాండ్ అప్ రాహుల్’ ఈ చిత్రాన్ని డ్రీమ్ టౌన్ ప్రొడక్షన్స్ మరియు హై ఫైవ్ పిక్చర్స్ పతాకంపై నంద్ కుమార్ అబ్బినేని మరియు భరత్ మగులూరిలు సంయుక్తంగా నిర్మించారు. స్టాండప్ కామెడీ నేపథ్యంలో ప్రేమ, భావోద్వేగాలు కూడిన కథతో రాబోతున్న సినిమా ఇది.

RRR : అమెరికాలో భారీగా ‘ఆర్ఆర్ఆర్’.. 1150 పైగా థియేటర్స్‌లో..

‘స్టాండప్ రాహుల్’ సినిమాని మార్చ్ 18న రిలీజ్ చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పాటలు, ట్రైలర్స్ కి మంచి స్పందన లభిస్తుంది. ఇటీవలే ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలు పెట్టారు. తాజాగా స్టాండప్ రాహుల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఇవాళ బుధవారం నిర్వహించనున్నారు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. దీనికి సంబంధించిన అధికారిక పోస్టర్ ని సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. హైదరాబాద్ JRC కన్వెన్షన్ లో సాయంత్ర ఆరు గంటల నుండి ఈ కార్యక్రమం జరగనుంది.

Varun Tej