Saindhav: సైంధవ్ కోసం జెర్సీ భామను ఫిక్స్ చేశారా..?

స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ నటిస్తున్న తాజా చిత్రాన్ని ‘హిట్’ చిత్రాల దర్శకుడు శైలేష్ కొలను డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై అమాంతం అంచనాలు పీక్స్‌కు చేరుకున్నాయి. ఈ సినిమాలో వెంకీని ఇదివరకు ఎప్పుడూ చూడని విధంగా దర్శకుడు చూపెట్టబోతున్నాడట. ఇక ఈ సినిమాను ఇప్పటికే స్టార్ట్ చేసిన చిత్ర యూనిట్, ఇప్పుడు ఈ సినిమాలో హీరోయిన్‌గా ఎవరు నటిస్తారా అనే విషయంపై కసరత్తు చేస్తోంది.

Saindhav: సైంధవ్ కోసం జెర్సీ భామను ఫిక్స్ చేశారా..?

Venkatesh Saindhav Movie To Have Shraddha Srinath As Female Lead

Saindhav: స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ నటిస్తున్న తాజా చిత్రాన్ని ‘హిట్’ చిత్రాల దర్శకుడు శైలేష్ కొలను డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై అమాంతం అంచనాలు పీక్స్‌కు చేరుకున్నాయి. ఈ సినిమాలో వెంకీని ఇదివరకు ఎప్పుడూ చూడని విధంగా దర్శకుడు చూపెట్టబోతున్నాడట. ఇక ఈ సినిమాను ఇప్పటికే స్టార్ట్ చేసిన చిత్ర యూనిట్, ఇప్పుడు ఈ సినిమాలో హీరోయిన్‌గా ఎవరు నటిస్తారా అనే విషయంపై కసరత్తు చేస్తోంది.

Saindhav: సైంధవ్ కోసం ఫస్ట్ హీరోయిన్‌ను పట్టుకొస్తున్న శైలేష్..?

ఇప్పటికే పలువురి పేర్లు వినిపించాయి. అందాల భామలు సాయి పల్లవి, శ్రీనిధి శెట్టి వంటి పేర్లు వినిపించాయి. కానీ, వారిని ఈ సినిమాలో తీసుకున్నట్లుగా ఎక్కడా అఫీషియల్‌గా అనౌన్స్ చేయలేదు. ఇక ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ఉంటారని.. కానీ హీరోతో ఎలాంటి రొమాంటిక్ ట్రాక్ ఉండబోదని చిత్ర యూనిట్ తెలిపింది. కాగా, తాజాగా ఈ సినిమాలో ఓ హీరోయిన్‌ను ఫైనల్ చేసిందట చిత్ర యూనిట్. ‘జెర్సీ’ మూవీతో టాలీవుడ్ ప్రేక్షకులను ఇంప్రెస్ చేసిన అందాల భామ శ్రద్ధా శ్రీనాథ్ ఈ సినిమాలో ఓ హీరోయిన్‌గా నటిస్తోందట.

Saindhav: వెంకటేష్ ‘సైంధవ్’ బ్యాక్‌డ్రాప్ ఇదేనా..?

ఆమెకు వెంకీతో ఎలాంటి రొమాంటిక్ ట్రాక్ ఉండదని చిత్ర యూనిట్ తెలిపింది. ఇక ఈ సినిమాలో మరో ఇద్దరు హీరోయిన్ల కోసం చిత్ర యూనిట్ సెర్చ్ చేస్తున్నారట. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ఈ సినిమాపై అంచనాలు భారీగా క్రియేట్ చేసింది. పూర్తి యాక్షన్ ఎంటర్టైనర్‌గా రాబోతున్న ఈ సినిమాలో వెంకీ పాత్ర అల్టిమేట్‌గా ఉంటుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.