ఆ విషయంలో రామారావు గారి తర్వాత బాలయ్య బాబే.. సీనియర్ నటి జమున..

ఆ విషయంలో రామారావు గారి తర్వాత బాలయ్య బాబే.. సీనియర్ నటి జమున..

Jamuna – Balakrishna: ఈ లాక్‌డౌన్ టైంలో ఇంట్లోనుండి బయటకు రావడం లేదు కానీ కాలక్షేపం కోసం పాత సినిమాలు చూస్తున్నట్లు చెప్పారు సీనియర్ నటి జమున.. చెన్నై నుండి నటి శారద అప్పుడప్పుడు ఫోన్ చేసి పలకరిస్తుంటారని అన్నారు.. అలాగే గీతాంజలి, కవిత, రోజా రమణి వంటి అలనాటి నటీమణులు రెగ్యులర్‌గా టచ్‌లో ఉంటారని తెలిపారు..

ఈ సందర్భంగా నటసింహా నందమూరి బాలకృష్ణను ప్రశంసించారామె.. ఇంకా ఆమె మాట్లాడుతూ.. ‘‘వారం క్రితం బాలయ్య బాబు ఫోన్‌ చేసి ‘అమ్మా ఎలా ఉన్నారు’ అని ఆప్యాయంగా పలకరించి, నా యోగక్షేమాలన్నీ అడిగారు. ఆయన నన్ను ఒక తల్లిలా భావిస్తారు.. గౌరవిస్తారు.. బాలయ్యకి పెద్దలంటే ఎంతో మర్యాద. కాబట్టే కదా, ఈ ఆపద సమయంలో నేను ఎలా ఉన్నానో అని ఫోన్‌ చేసి మరీ పలకరించారు.

వాళ్ల నాన్న గారి సంస్కారాన్నంతా బాలయ్య పుణికి పుచ్చుకున్నాడు. ఎన్టీఆర్‌ గారు కూడా అంతే, ఆడవాళ్లని ఎంతో గౌరవించేవారు. సెట్‌లో లైట్‌బాయ్‌ దగ్గరి నుంచి, టీ, కాఫీలు అందించే ప్రొడక్షన్‌ బాయ్‌ని కూడా ‘మీరు’ అని పిలిచేవారు.. ఆ మహనీయుడి తీరే వేరు.. నందమూరి కుటుంబంలో సంస్కారం, గౌరవం విషయాల్లో రామారావు గారి తర్వాత బాలయ్య బాబే గుర్తొస్తారు..’’ అన్నారు జమున..