Vicky-Katrina : పెళ్లి తర్వాత మొదటిసారి మీడియాకి చిక్కిన బాలీవుడ్ కొత్తజంట

బాలీవుడ్‌ కొత్తజంట విక్కీ కౌశల్‌-కత్రినా కైఫ్‌లు భార్యభర్తలుగా తొలిసారి మీడియాకి చిక్కారు. తాజాగా ఈ జంట నిన్న ముంబై చేరుకున్నారు. ముంబై విమానాశ్రమంలో దిగిన తర్వాత మీడియాకి....

Vicky-Katrina :  పెళ్లి తర్వాత మొదటిసారి మీడియాకి చిక్కిన బాలీవుడ్ కొత్తజంట

Vicky Katrina

Vicky-Katrina : బాలీవుడ్‌ కొత్తజంట విక్కీ కౌశల్‌-కత్రినా కైఫ్‌లు భార్యభర్తలుగా తొలిసారి మీడియాకి చిక్కారు. ఇటీవల రాజస్థాన్ లో ఈ జంట సీక్రెట్ గా తక్కువ మంది అతిధులతో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వివాహం తర్వాత కూడా కొన్ని రోజులు రాజస్థాన్ లోనే గడిపారు ఈ జంట. వీరి పెళ్లి నుంచి ఒక్క వీడియో కూడా బయటకి రాలేదు. కొన్ని ఫోటోలు మాత్రమే తమ సోషల్ మీడియా అకౌంట్స్ లో షేర్ చేశారు విక్కీ కత్రీనా. తాజాగా ఈ జంట నిన్న ముంబై చేరుకున్నారు.

Bollywood : కరణ్ జోహార్ పార్టీతో బాలీవుడ్‌లో కరోనా కలకలం

ఈ నేపథ్యంలో ముంబై విమానాశ్రమంలో దిగిన తర్వాత మీడియాకి చిక్కారు. ఎయిర్‌పోర్ట్‌ ముందు మీడియా ఉండటంతో మీడియాకి ఫోజులు ఇచ్చారు. పెళ్లి తర్వాత భార్యభర్తలుగా విక్కీ, కత్రినాలు మీడియా ముందుకు రావడం ఇదే తొలిసారి కావడంతో ఈ వీడియో, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కత్రినా సాంప్రదాయంగా చుడిదార్‌ ధరించి చేతి నిండా మెహందీ, గాజులతో కొత్త పెళ్లికూతురు మెరిసిపోతుంది. విక్కీ కూడా ఫార్మల్‌ లుక్‌లో అదరగొట్టేసాడు. వీరిద్దరూ చేతిలో చేయి వేసుకొని వచ్చారు. మీడియా పలకరించడంతో అందరికి అభివందనం చేశారు. అక్కడున్న వాళ్లంతా వీరికి శుభాకాంక్షలు తెలిపారు. ఇక ఫ్యాన్స్ అంతా వైరల్ అవుతున్న ఈ వీడియో, ఫోటోల కింద హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.