‘విధి విలాసం’ ప్రారంభం

అరుణ్ అదిత్, శివాత్మిక రాజశేఖర్ జంటగా నటిస్తున్న ‘విధి విలాసం’ ప్రారంభం..

  • Published By: sekhar ,Published On : January 20, 2020 / 09:03 AM IST
‘విధి విలాసం’ ప్రారంభం

అరుణ్ అదిత్, శివాత్మిక రాజశేఖర్ జంటగా నటిస్తున్న ‘విధి విలాసం’ ప్రారంభం..

కథ, PSV గరుడవేగ, 24 కిస్సెస్ సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న అరుణ్ అదిత్, ‘దొరసాని’ మూవీతో కథానాయికగా తెరంగేట్రం చేసిన శివాత్మిక రాజశేఖర్ జంటగా.. దుర్గా నరేస్ గుత్తా ను దర్శకుడిగా పరిచయం చేస్తూ.. యస్ కె యస్ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్న ప్రొడక్షన్ నెం 1 చిత్రం సోమవారం ఫిలింనగర్ దైవసన్నిధిలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.

Image

ఈ చిత్రానికి ‘విధి విలాసం’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. హీరో హీరోయిన్లపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు ప్రవీణ్ సత్తారు క్లాప్ నివ్వగా.. హరీష్ శంకర్ కెమెరా స్విచ్చాన్ చేశారు. దశరధ్ గౌరవ దర్శకత్వం వహించారు. జీవిత రాజశేఖర్ స్క్రిప్ట్ అందజేశారు.

Image

యూత్‌కి నచ్చే ప్రేమకథా చిత్రంగా ‘విధి విలాసం’ తెరకెక్కబోతుందని తెలుస్తుంది. ప్రస్తుతం ఇతర నటీనటుల, సాంకేతిక నిపుణుల ఎంపిక జరుగుతోంది. త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.

Image