“దావోస్” మోడల్‌లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్-2025.. హాజరవుతున్న పారిశ్రామిక, క్రీడా, సినీ ప్రముఖులు వీరే..
రాష్ట్ర భవిష్యత్ దిశను నిర్ణయించేందుకు ఈ రెండు రోజుల సమిట్‌ను రూపొందించారు.
Telangana Rising Global Summit 2025
Telangana Rising Global Summit 2025: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025 డిసెంబర్ 8, 9 తేదీల్లో భారత్ ఫ్యూచర్ సిటీ వద్ద జరుగుతుంది. ప్రముఖ పారిశ్రామికవేత్తలు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు, క్రీడా, సినీ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరవుతారు. దావోస్‌లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం మోడల్‌లో.. ఈ రెండు రోజుల సమిట్‌ను రూపొందించారు.
రాష్ట్ర భవిష్యత్ దిశను నిర్ణయించేందుకు ఈ రెండు రోజుల సమిట్‌ను రూపొందించారు. ఎనర్జీ, గ్రీన్ మొబిలిటీ, ఐటీ, సెమీకండక్టర్స్, హెల్త్‌కేర్, ఎడ్యుకేషన్, టూరిజం, అర్బన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, వ్యవసాయం, పరిశ్రమలు, మహిళా ఎంట్రప్రెన్యూర్షిప్ ప్రోత్సాహం, గిగ్ ఎకానమీ, సామాజిక సంక్షేమం, స్టార్టప్స్ వంటి కీలక రంగాల్లో 27 ప్రత్యేక ప్యానెల్ చర్చలను నిర్వహిస్తుంది.
వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, వరల్డ్ బ్యాంక్, ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్, యునిసెఫ్ వంటి అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు పాల్గొంటారు. టెరి, బీసీజీ, మైక్రాన్ ఇండియా, హిటాచీ ఎనర్జీ, ఓ2 పవర్, గ్రీన్కో, అపోలో హాస్పిటల్స్, ఐఐటీ హైదరాబాద్, నాస్కామ్, సాఫ్రాన్, డీఆర్‌డీఓ, స్కైరూట్, ధ్రువ స్పేస్, అమూల్, లారస్ ల్యాబ్స్, జీఎంఆర్, టాటా రియాల్టీ, కోటక్ బ్యాంక్, గోల్డ్‌మన్ సాక్స్, బ్లాక్‌స్టోన్, డెలాయిట్, క్యాపిటాల్యాండ్, స్విగ్గి, ఏడబ్ల్యూఎస్, రెడ్ హెల్త్, పీవీఆర్ ఇనాక్స్, సిక్యా ఎంటర్‌టైన్‌మెంట్, తాజ్ హోటల్స్ తదితర సంస్థల ప్రముఖులు హాజరవుతారు.
Also Read: Sankranti 2026: పందెం కోళ్ల డోర్ డెలివరీ.. రేట్లు ఎలాగున్నాయో తెలుసా?
క్రీడా ప్రముఖులు పి.వి.సింధు, అనిల్ కుంబ్లే, పుల్లెల గోపీచంద్, గగన్ నారంగ్, జ్వాలా గుత్తా “ఒలింపిక్ గోల్డ్ క్వెస్ట్” సెషన్‌లో పాల్గొంటారు.
సినీ ప్రముఖులు ఎస్‌ఎస్ రాజమౌళి, రితేశ్ దేష్‌ముఖ్, సుకుమార్, గునీత్ మొంగా, అనుపమా చోప్రా “క్రియేటివ్ సెంచరీ – సాఫ్ట్ పవర్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్” చర్చలో పాల్గొంటారు.
డిసెంబర్ 9న “తెలంగాణ రైజింగ్-2047 విజన్ డాక్యుమెంట్” విడుదల చేస్తారు. ఇది ప్రధాన ఆకర్షణగా ఉంటుంది. ఈ డాక్యుమెంట్ 2047 నాటికి రాష్ట్రాన్ని 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చే రోడ్‌మ్యాప్‌ను ప్రదర్శిస్తుంది. అవసరమైన పెట్టుబడులు, టెక్నాలజీ భాగస్వామ్యాలు, అన్ని రంగాల్లో వినూత్నత ప్రణాళికలను ఇందులో వివరిస్తారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులు ప్రతినిధులందరికీ అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలు అందించేందుకు సమన్వయం చేస్తున్నారు.
