Sankranti 2026: పందెం కోళ్ల డోర్ డెలివరీ.. రేట్లు ఎలాగున్నాయో తెలుసా?
గతంలో కోడిపుంజులు కొనాలంటే వాటిని పెంచేవారి వద్దకు వెళ్లి కొనేవారు. ఇప్పుడు ఆన్‌లైన్‌లోనూ వాటిని అమ్ముతున్నారు.
Cock
Sankranti 2026: ఆన్‌లైన్‌లో బైకులు, కార్లు, గృహోపకరణాలను అమ్మడం సాధారణమే. సంక్రాంతి సమీపిస్తున్న వేళ ఇప్పుడు పందెం కోళ్లను కూడా ఆన్‌లైన్‌లో విక్రయించాలని కొందరు భావిస్తున్నారు.
కోడి ఫొటోతో పాటు అది ఏ జాతికి చెందింది? దాని ప్రత్యేకతలు ఉంటి? వయసు, బరువు ఎంత? వంటి వివరాలను ఆన్‌లైన్‌లో ఉంచి వాటిని విక్రయించే అవకాశం ఉంది. డిస్కౌంట్‌లు కూడా ప్రకటించే ఛాన్స్ ఉంది.
సంక్రాంతి అనగానే తెలుగు వారికి గోదావరి జిల్లాల్లో జరిగే కోడి పందేలు గుర్తుకువస్తాయి. భీమవరం పరిసరాల్లో పందేలకు ఉండే డిమాండ్‌కు తగ్గట్టే పుంజుల విషయంలో శ్రద్ధ పెడతారు. ఉమ్మడి గోదావరి జిల్లాల్లో నాటుకోళ్ల పెంపక సెంటర్లు 200లకు పైగా ఉన్నాయి.
సంక్రాంతి సీజన్‌లో వీటి విక్రయాల ద్వారా రూ.15 కోట్ల పైనే వ్యాపారం జరుగుతుంది. గతంలో కోడిపుంజులు కొనాలంటే వాటిని పెంచేవారి వద్దకు వెళ్లి కొనేవారు. ఇప్పుడు ఆన్‌లైన్‌లోనూ వాటిని అమ్ముతున్నారు.
పందెం కోళ్లకు శిక్షణను ఇవ్వడంతో పాటు మేత, మందులకు ఒక్కో పుంజుకు రూ.20,000-రూ.25,000 వరకు ఖర్చుచేస్తారు. ఒక్కో పుంజు రూ.50 వేల నుంచి రూ.లక్షల్లో ధర పలుకుతుంది.
ఫేస్‌బుక్‌తో పాటు ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌ను వాడుకుంటూ భీమవరం, తాడేపల్లిగూడెం, కోనసీమ వంటి ప్రాంతాల్లోని కొందరు వీటిని అమ్ముతున్నారు. ఆ కోళ్లను సంబంధించిన వివరాలు అన్నీ చెబుతున్నారు. కోళ్లను ఇస్తున్న శిక్షణ, ఆహారం వంటి వివరాలపై రీల్స్ చేసి పెడుతున్నారు. అంతేకాదు, ఈ-కామర్స్ వెబ్‌సైట్లలోనూ పందెం కోళ్లు దర్శనమిస్తున్నాయి.
