Kushi : విజయ్ దేవరకొండ, సమంత సాంగ్ విన్నారా?.. మణిరత్నం సినిమా పేర్లతో సాంగ్.. భలే రాశారే..

ఈ సాంగ్ నా రోజా నువ్వే.. నా దిల్ సే నువ్వే.. అని సాగుతుంది. ప్రతి చరణంలోను నాలుగు లైన్ ఉంటే ప్రతి లైన్ ను కూడా మణిరత్నం సినిమా పేరు వచ్చేలా రాశారు. మణిరత్నం తీసిన తెలుగు, తమిళ సినిమాల టైటిల్స్ తో ఈ పాటను రాశాడు డైరెక్టర్ శివ నిర్వాణ. పాట విన్నాక అంతా ఆశ్చర్యపోతున్నారు. ఈ పాటలో దాదాపు మణిరత్నం తీసిన 14 సినిమా పేర్లను వాడారు.

Kushi : విజయ్ దేవరకొండ, సమంత సాంగ్ విన్నారా?.. మణిరత్నం సినిమా పేర్లతో సాంగ్.. భలే రాశారే..

Vijay Devarakonda and Samantha Movie Kushi First song Released

Kushi :  విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), సమంత (Samantha) జంటగా నటిస్తున్న చిత్రం ‘ఖుషీ’. లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ చిత్రాన్ని శివ నిర్వాణ డైరెక్ట్ చేస్తున్నాడు. ఇటీవలే ఈ మూవీ ప్రమోషన్స్ మొదలు పెట్టిన చిత్ర యూనిట్ తాజాగా నిన్న విజయ్ దేవరకొండ బర్త్ డే కానుకగా మూవీలోని ఫస్ట్ సాంగ్ ని రిలీజ్ చేశారు. ఈ మూవీకి మలయాళ మ్యూజిక్ డైరెక్టర్ హేశం అబ్దుల్ వహాబ్ సంగీతం అందించగా డైరెక్టర్ శివ నిర్వాణ లిరిక్స్ అందిచాడు. సంగీత దర్శకుడు అబ్దుల్ వహాబ్ ఈ పాటని పాడాడు. ఈ సాంగ్ మొత్తం కశ్మీర్ లోయల్లోనే చిత్రీకరించారు.

Kushi : విజయ్ దేవరకొండ బర్త్ డే గిఫ్ట్.. ఖుషి ఫస్ట్ సాంగ్ రిలీజ్!

అయితే ఈ సాంగ్ నా రోజా నువ్వే.. నా దిల్ సే నువ్వే.. అని సాగుతుంది. ప్రతి చరణంలోను నాలుగు లైన్ ఉంటే ప్రతి లైన్ ను కూడా మణిరత్నం సినిమా పేరు వచ్చేలా రాశారు. మణిరత్నం తీసిన తెలుగు, తమిళ సినిమాల టైటిల్స్ తో ఈ పాటను రాశాడు డైరెక్టర్ శివ నిర్వాణ. పాట విన్నాక అంతా ఆశ్చర్యపోతున్నారు. ఈ పాటలో దాదాపు మణిరత్నం తీసిన 14 సినిమా పేర్లను వాడారు.

నా ‘రోజా’ నువ్వే
నా ‘దిల్ సే’ నువ్వే
నా ‘అంజలి’ నువ్వే
నా ‘గీతాంజలి’ నువ్వే

నా ‘కడలి’ కెరటంలో
ఓ ‘మౌనరాగం’ నువ్వేలే
నీ ‘అమృత’పు జడిలో
ఓ ‘ఘర్షణే’ మొదలయ్యిందే

నా ‘సఖి’వి నువ్వేలే
నీ ‘దళపతి’ని నేనేలే
నా ‘చెలియా’ నువ్వేలే
నీ ‘నాయకుడు’ నువ్వేలే

‘ఓకే బంగారం’

నా ప్రేమ ‘పల్లవి’లో నువ్వు చేరవే ‘అనుపల్లవి’గా … ఇలా మణిరత్నం తీసిన సినిమాల్లో తమిళ్, తెలుగు టైటిల్స్ వాడి ఈ పాటను చాలా చక్కగా, మెలోడిగా రాశారు. దీంతో ఈ పాట మరింత వైరల్ అవుతుంది. ఒక్క రోజులో కేవలం తెలుగులోనే ఈ పాట 5 మిలియన్ వ్యూస్ దక్కించుకుంది. ఈ సినిమాని పాన్ ఇండియా రిలీజ్ చేస్తుండటంతో పాటను కూడా తెలుగుతో పాటు తమిళ్, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో కూడా రిలీజ్ చేశారు. ఈ పాటని విని మణిరత్నం అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ పాట మణిరత్నం వరకు వెళ్తుందా? దీనిపై మణిరత్నం ఏమైనా స్పందిస్తాడేమో చూడాలి. మొత్తానికి మొదటి పాటతోనే సినిమాకు మంచి మైలేజ్ తెచ్చుకున్నాడు విజయ్.