Vijay Deverakonda : 100 మందికి జీవితాంతం గుర్తిండిపోయే జ్ఞాపకాలు అందించిన విజయ్ దేవరకొండ..

గత ఐదేళ్లుగా ‘దేవరశాంటా’ పేరుతో ప్రతి సంవత్సరం ఫ్యాన్స్ కి న్యూ ఇయర్ బహుమతులు ఇస్తూ వస్తున్న విజయ్ దేవరకొండ.. ఈ ఏడాది అభిమానులను ఫ్రీ వెకేషన్ కి పంపించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ ట్రిప్ కి సంబంధించిన వీడియో గ్లింప్స్ ని విజయ్ తన సోషల్ హ్యాండిల్ లో పోస్ట్ చేశాడు. ఆ వీడియోలో..

Vijay Deverakonda : 100 మందికి జీవితాంతం గుర్తిండిపోయే జ్ఞాపకాలు అందించిన విజయ్ దేవరకొండ..

deverasanta

Vijay Deverakonda : గత ఐదేళ్లుగా ‘దేవరశాంటా’ పేరుతో ప్రతి సంవత్సరం ఫ్యాన్స్ కి న్యూ ఇయర్ బహుమతులు ఇస్తూ వస్తున్న విజయ్ దేవరకొండ.. ఈ ఏడాది అభిమానులను ఫ్రీ వెకేషన్ కి పంపించిన సంగతి తెలిసిందే. మొత్తం 100 మంది ఫ్యాన్స్ ని ఎంపిక చేసిన విజయ్ తన ఖర్చుతో వాళ్ళందర్నీ, వాళ్ళ కోరిక మేరకు ‘కులుమనాలి’ పంపించాడు. ఓవైపు నటుడిగా శిఖరాలు అందుకుంటున్న విజయ్.. అభిమానులకి వీలైనంత ప్రేమని కూడా అందిస్తూ మిగిలిన హీరోలకు ఆదర్శంగా నిలుస్తున్నాడు.

Vijay Devarakonda : టూర్‌కి పంపించిన అభిమానులను సర్‌ప్రైజ్ చేసిన రౌడీ హీరో..

ఇక కేవలం డబ్బులు పెట్టి వాళ్ళని టూర్ కి పంపిచడమే కాదు, వాళ్ళకి జీవితాంతం గుర్తిండిపోయే ఎన్నో జ్ఞాపకాలు కూడా అందించాడు. తన తల్లిదండ్రులతో కలిసి కులుమనాలి వెళ్లి అక్కడ టూర్ ని ఎంజాయ్ చేస్తున్న అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చి, వాళ్ళతో కొంత టైం స్పెండ్ చేసి వాళ్లకి గుర్తుండిపోయే ఎన్నో మధుర జ్ఞాపకాలు అందించాడు. తాజాగా ఈ ట్రిప్ కి సంబంధించిన వీడియో గ్లింప్స్ ని విజయ్ తన సోషల్ హ్యాండిల్ లో పోస్ట్ చేశాడు. ఆ వీడియోలో చిన్నప్పుడు ట్రిప్ కి వెళ్లిన కొన్ని జ్ఞాపకాలను విజయ్ పంచుకున్నాడు. చిన్నతనంలో ట్రిప్ కి వెళ్ళడానికి తన దగ్గర డబ్బు లేకపోతే, తన స్నేహితులు వాళ్ళ డబ్బుతో విజయ్ ని టూర్ కి తీసుకు వెళ్లడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని తెలియజేశాడు.

అదే ఆనందాన్ని తన అభిమానులకు కలగజేసేలా, ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాడు. ఈ క్రమంలోనే 100 మంది సామాన్యులని తన సొంత ఖర్చు తో మనాలి ట్రిప్ కి పంపించినట్లు తెలియజేశాడు. ఇక అలాగే ఈ వీడియోలో అభిమానులు.. ఈ ట్రిప్ లో భాగమైన ఆనందాన్ని, విజయ్ మీద తమ ప్రేమని, తమ జీవితంలో ఈ ట్రిప్ ఎంత ముఖ్యమో తెలియజేశారు. వీడియో చివరిలో అందరూ ఎమోషనల్ అయ్యి విజయ్ ని హగ్ చేసుకోవడం వీడియో చూసిన వారిని కూడా ఎమోషనల్ చేస్తుంది.