Liger: విజయ్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. లైగర్ రిలీజ్ డేట్ వచ్చేసింది

యంగ్ హీరో విజయ్‌ దేవరకొండ నటిస్తున్న పాన్‌ ఇండియా సినిమా ‘లైగర్‌’.

Liger: విజయ్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. లైగర్ రిలీజ్ డేట్ వచ్చేసింది

Liger

Liger: యంగ్ హీరో విజయ్‌ దేవరకొండ నటిస్తున్న పాన్‌ ఇండియా సినిమా ‘లైగర్‌’. పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన లైగర్ సినిమాలో బాలీవుడ్‌ బ్యూటీ అనన్యా పాండే హీరోయిన్‌గా చేస్తుండగా.. కరణ్‌ జోహార్, పూరి జగన్నాథ్, చార్మి, అపూర్వా మెహతా కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

ఈ సినిమా ఈ ఏడాది సెప్టెంబర్‌లోనే విడుదల కావాల్సి ఉండగా కరోనా పరిస్థితులతో వాయిదా పడుతూ వచ్చింది. లేటెస్ట్‌గా ఈ సినిమా రిలీజ్ డేట్‌ని అనౌన్స్ చేసింది చిత్రయూనిట్. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా వచ్చే ఏడాది ఆగస్టు 25వ తేదీన విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఈ ఏడాది చివర్లో డిసెంబర్ ‌31వ తేదీన లైగర్‌ గ్లింప్స్‌ను రిలీజ్‌ చేయనున్నట్లు వెల్లడించారు.

స్పోర్ట్స్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మైక్‌ టైసన్‌ కీలకపాత్రలో కనిపించబోతున్నారు. గతంలో స్పోర్ట్స్ నేపధ్యంలో పూరీ రవితేజతో అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి సినిమా తియ్యగా.. ఆ సినిమా తర్వాత అదే జోనర్‌లో లైగర్ వస్తోంది.