Adivi Sesh : మేజర్ పై విజయ్ దేవరకొండ స్పెషల్ ట్వీట్..

మేజర్ సినిమాపై సామాన్య ప్రేక్షకులతో పాటు పలువురు సెలబ్రిటీలు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా విజయ్ దేవరకొండ ఈ సినిమాని అభినందిస్తూ స్పెషల్ ట్వీట్ చేశాడు. విజయ్ ఈ ట్వీట్ లో....................

Adivi Sesh : మేజర్ పై విజయ్ దేవరకొండ స్పెషల్ ట్వీట్..

Major Vijay Devarakonda

Vijay Devarakonda : 26/11 దాడుల్లో వీర మరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన సినిమా మేజర్. అడివి శేష్, సయీ మంజ్రేకర్ జంటగా శశికిరణ్ తిక్క దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ నిర్మాణంలో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా భాగమయ్యారు. ఈ సినిమా రిలీజ్ రోజు నుంచే హిట్ టాక్ ని తెచ్చుకుంది. ఇప్పటికే ఈ సినిమాకి 40 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చి ఎప్పుడో బ్రేక్ ఈవెన్ సాధించి, పెట్టిన పెట్టుబడి కూడా వచ్చేసి భారీ హిట్ గా నిలిచింది.

Kamal haasan : విక్రమ్ భారీ సక్సెస్.. డైరెక్టర్‌కి ఖరీదైన కారు బహుమతి ఇచ్చిన కమల్ హాసన్

ఇక మేజర్ సినిమాపై సామాన్య ప్రేక్షకులతో పాటు పలువురు సెలబ్రిటీలు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా విజయ్ దేవరకొండ ఈ సినిమాని అభినందిస్తూ స్పెషల్ ట్వీట్ చేశాడు. విజయ్ ఈ ట్వీట్ లో.. ”ఈ సినిమా మంచి అభిరుచి, ప్రేమ, నిజాయితితో కుడి ఉంది. మేజర్ సందీప్ ని చూసి మనమంతా నేర్చుకోవాలి. ఆయన ఒక నిజమైన ఐడల్ లాంటివారు. అతని గురించి కచ్చితంగా తెలుసుకోవాలి. అందుకే ఈ సినిమాని కచ్చితంగా చూడండి. ఈ సినిమాలో భాగమయిన ప్రతి ఒక్కరికి, మేజర్ సందీప్ తల్లితండ్రులకు నా ప్రేమ, అభినందనలు” అని పోస్ట్ చేశారు.