మళ్లీ వీళ్లందర్నీ వెనక్కినెట్టేశాడుగా.. ఈ క్రేజేంటి స్వామీ..

మళ్లీ వీళ్లందర్నీ వెనక్కినెట్టేశాడుగా.. ఈ క్రేజేంటి స్వామీ..

మోస్ట్ డిజైరబుల్ మెన్ 2019 - టాలీవుడ్ క్రీజీ హీరో విజయ్ దేవరకొండ..

మళ్లీ వీళ్లందర్నీ వెనక్కినెట్టేశాడుగా.. ఈ క్రేజేంటి స్వామీ..

మోస్ట్ డిజైరబుల్ మెన్ 2019 – టాలీవుడ్ క్రీజీ హీరో విజయ్ దేవరకొండ..

క్రేజ్‌కి హిట్స్, ఫ్లాప్స్‌తో సంబంధం లేదని ప్రూవ్ చేసాడు టాలీవుక్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ. యూత్‌లో రౌడీకి మంచి ఫాలోయింగ్ ఉందనే సంగతి తెలిసిందే. తాజాగా విజయ్ ‘మోస్ట్ డిజరైబుల్ మెన్’ 2019లో ఫస్ట్ ప్లేస్‌లో నిలిచాడు. 2018లోనూ మొదటి స్థానంలో ఉన్న విజయ్  ఏడాది కూడా తన నెంబర్ వన్ స్థానాన్ని కాపాడుకున్నాడు. 2019 సంవత్సరానికిగాను హైదరాబాద్ టైమ్స్ ‘మోస్ట్ డిజైరబుల్ మెన్’ జాబితాలో విజయ్ దేవరకొండ తొలి స్థానంలో నిలిచాడు. వరుసగా ఫ్లాపులు పడుతున్నప్పటికీ మనోడి క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని దీంతో ప్రూవ్ అయింది.

ఈ లిస్టులో మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ రెండో స్థానంలో నిలిచాడు. గతేడాది మూడో స్థానంలో ఉన్న చెర్రీ ఈ ఏడాది మరో మెట్టు పైకి వచ్చాడు. ఇక, 3,4 స్థానాల్లో వరుసగా ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నిలిచారు. గతేడాది రెండో స్థానంలో ఉన్న ప్రభాస్ ఈసారి 4వ స్థానానికి పడిపోయాడు. ఇక టాప్ 10 జాబితాలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, సుధీర్ బాబు, యాంకర్ ప్రదీప్‌ మాచిరాజు ఉన్నారు.

యంగ్ టైగర్ ఎన్టీయార్ 19వ స్థానంలో నిలిచాడు. ఈ లిస్టులో యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య 11, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ 12, అఖిల్ అక్కినేని 14వ స్థానాల్లో నిలిచారు

హైదరాబాద్ టైమ్స్ ‘30 మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ 2019’లో సమంత ఫస్ట్ ప్లేస్‌ దక్కించుకున్న సంగతి తెలిసిందే.. 

Read Also : అనుష్క శర్మ ‘సేఫ్ హ్యాండ్ ఛాలెంజ్’ చూశారా..

×